twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బహిరంగ క్షమాపణకై హీరోయిన్ ఇంటివద్ద ధర్నా..అరెస్టులు

    By Srikanya
    |

    చెన్నై: తమిళ హీరోయిన్ సోనా ఇంటిని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని 25 మందిని అరెస్టు చేశారు. ఇటీవల పురుషులు, వివాహ వ్యవస్థపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని పురుషుల పరిరక్షణ సంఘం ఇదివరకే డిమాండ్‌ చేసింది.

    'పురుషుల్ని టిష్యూ పేపర్‌లా వాడుకోవాలి... సెక్స్ అవసరం తీరిన తరువాత చేతులు దులుపుకోవాలి.. వారితో వివాహం పేరుతో శాశ్వత బంధాన్ని పెంచుకోకూడదు' అంటూ ఆమె కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో సంఘం అధ్యక్షుడు అరుళ్‌తుమిళన్‌ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది సోమవారం ఉదయం తేనాంపేట భారతీదాసన్‌ రోడ్డులోని సోనా ఇంటి ముందు గుమికూడారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. సమాచారం మేరకు చేరుకున్న పోలీసులు వారిలో 25 మందిని అరెస్టు చేశారు.

    మరో ప్రక్క తనను అనవసరంగా వివాదంలోకి లాగి తన జీవితాన్ని సమస్యల వలయంలోకి నెట్టారని నటి సోనా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ శృంగారతార పురుషులను అవమానపరచే విధంగా మాట్లాడిందనే అంశం పెద్ద కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కొన్ని సంఘాలు ఆమె ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. దీనివల్ల తాను చాలా నష్టపోయానంటోంది సోనా. దీని గురించి ఆమె వివరిస్తూ ఒక పత్రిక తన అభిప్రాయాలను వక్రీకరించి రాసి తనను సమస్యల్లోకి నెట్టిందని ఆరోపించింది.

    పురుషులను తాను అవమానపరచినట్లు రాశారని, దీంతో కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయని వెల్లడించింది.ఫలితంగా తన వస్త్రాల దుకాణాన్ని తెరవలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ వ్యాపారానికి సంబంధించి నగరంలో మరికొన్ని శాఖలు విస్తరింప చేయాలన్న ప్రయత్నానికి ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన నివాసాన్ని మార్చాలనుకున్నానని, ఈ సమస్యల కారణంగా నూతన ఇంటి యజమాని ఇల్లు అద్దెకు ఇవ్వనంటూ తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారని తెలిపింది.

    కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మానసిక వేదనకు గురిచేస్తున్నాయని వాపోయింది. అనవసర వివాదంలోకి లాగి తన జీవితాన్ని సమస్యల మయం చేశారంది. సినిమా తీసి నష్టపోయిన తాను ఇటీవలే మళ్లీ నటనపై దృష్టి సారించానని పేర్కొంది. తన ఎదుగుదలను హరించడానికి ఎవరో చేస్తున్న కుట్రగా భావించాల్సి వస్తోందని అంది. తనకు చాలామంది మిత్రులున్నారని, శత్రువులు కూడా ఉన్నారని ఈ సంఘటనలతో అర్థం అవుతోందని సోనా పేర్కొంది.

    English summary
    
 Police on Monday arrested 24 men for staging a protest outside actor Sona Heiden's residence in Teynampet on Monday. They were later let off in the evening. Members of the Association for Protection of Men raised slogans against Sona and demanded that the actor render a public apology for her 'sex' remarks in a Tamil magazine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X