ఎంత ధైర్యం వాళ్లకు.. రజని ఫ్యాన్స్ గుణపాఠం చెప్పాలి!

600 కోట్ల భారీ బడ్జెట్.. అంతకు మించిన అంచనాలు, వెలది మంది టెక్నిషియన్ల శ్రమ ఫలితమే 2.0 చిత్రం. దర్శకుడు శంకర్ విజన్ కు అనుగుణంగా వేలాదిమంది పనిచేశారు కాబట్టే 2.0 లాంటి అద్భుత చిత్రం వెండి తెరపై ఆవిష్కృతమైంది. అందరూ భయపడుతున్నట్లుగానే పైరసీ భూతం 2.0పై కూడా తన పంజా విసిరింది. చెప్పి మరీ ఈ ఘాతుకానికి తెగబడడంతో చిత్రం యూనిట్ తమిళ్ రాకర్స్ పై ఆగ్రహంతో ఉన్నారు. పైరసీ లీక్ కాకుండా చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ చిత్రానికి డిజైనర్ గా పనిచేసిన రసూల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

12 వేల వెబ్ సైట్లు

12 వేల వెబ్ సైట్లు

2.0 విడుదలకు ముందు చిత్ర యూనిట్ పైరసీతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించింది. దీనితో నిర్మాతలు హై కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ 12 వేలకు పైగా ఉన్న నకిలీ వెబ్ సైట్స్ ని బ్లాక్ చేయాలని ఆదేశించింది. దీనితో ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఆయా వెబ్ సైట్స్ ని బ్లాక్ చేశారు. అయినా కూడా తమిళ్ రాకర్స్ 2.0 పైరసీ లీక్ చేశారు.

 ఎంత ధైర్యం వాళ్లకు

ఎంత ధైర్యం వాళ్లకు

పైరసీ లీక్ కావడంతో 2.0 చిత్రానికి డిజైనర్ గా పనిచేసిన రసూల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోర్టు ఆదేశాలు జారీ చేసినా పైరసీ లీక్ చేశారు. వీళ్లకు ఎంత ధైర్యం. రజనీకాంత్ అభిమానులంతా ఏకమై పైరసీగాళ్లకు గుణపాఠం చెప్పాలని రసూల్ కోరారు. మరో వైపు లైకా సంస్థ కూడా ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేసింది. ఎక్కడైనా పైరసీ లింకులు కనిపిస్తే తమకు తెలియజేయాలని రజనీకాంత్ అభిమానులని కోరింది.

గొప్ప అనుభూతి కలిగించాలని

గొప్ప అనుభూతి కలిగించాలని

ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలిగించాలని దర్శకుడు శంకర్ సహా వేలాదిమంది సాంకేతిక నిపుణులు ప్రయత్నించారు. వారి కష్టానికి ప్రతి రూపమే 2.0 అని లైకా సంస్థ తెలిపింది. పైరసీని వైరల్ చేసి ఆ అనుభూతిని నాశయం చేవద్దు అంటూ కోరింది. త్రీడి ఫార్మాట్ లో రూపొందించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిట్టి విన్యాసాలు, అక్షయ్ కుమార్ భారీ రూపాన్ని ప్రేక్షకులను ఎంజాయ్ చేస్తున్నారు.

భారీ వసూళ్ల దిశగా

భారీ వసూళ్ల దిశగా

2.0 చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2.0 చిత్రం తరువాత దీనికి సీక్వెల్ గా 3.0 ఉంటుందని శంకర్ హింట్ ఇచ్చారు. 600 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్, గ్రాండ్ విజువల్స్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి బలంగా మారింది. వీకెండ్ వసూళ్ళులని బట్టి 2.0 ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో అంచనాకు రావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X