3 వేలమంది టెక్నీషియన్ల శ్రమ.. 500 కోట్ల బడ్జెట్.. 2.0 గురించి శంకర్!
కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ అంటే ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేది. బాహుబలి చిత్రంతో రాజమౌళి ఆ అభిప్రాయాన్ని చెరిపేశాడు. కళ్ళు చెదిరే విజువల్స్ తో బాహుబలి చిత్రంతో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. 2.0 చిత్రం పేరుకే భారతీయ చిత్రం కానీ హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండబోతోంది.
వినాయక చవితి కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు. టీజర్ కే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం. తాజాగా దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా 3 వేలమంది టెక్నీషియన్లు పనిచేసినట్లు శంకర్ తెలిపాడు.

కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏడాది సమయం వెచ్చించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ ఈ చిత్రం కోసం పనిచేశారు. విధంగా ఈ చిత్ర బడ్జెట్ లెక్క కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రం కోసం దాదాపు 500 కోట్ల(75 మిలియన్ డాలర్స్) ఖర్చు చేసినట్లు పోస్టర్ ద్వారా శంకర్ ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











