త్రీ ఇడియట్స్ అంటే వీళ్ళే ఫస్ట్ పోస్టర్ పై ఫస్ట్ లుక్కేయండి...

By Sindhu

అల్ టైం బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మిం '3 ఇడియట్స్' ను తమిళ , తెలుగు బాషలలో జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తుంది. తమిళంలో 'నాన్ బన్' గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్, శ్రీకాంత్(శ్రీరామ్), జీవా ఇడియట్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మధ్యే చెన్నై విడుదల చేసారు. శంకర్ మార్క్ తో రూపొందిన ఆ పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వైవిధ్యమైన రీతిలో సంగీతాన్ని అందించడానికి హారిస్ జై రాజ్ సన్నద్ధం అవుతున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్న 'నాన్ బన్' సినిమాకు అంటోనీ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి తమిళనాడులో విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

3 ఇడియట్స్ ను తెలుగులో కూడా రీమేక్ చేయవలసిఉంది కానీ హీరో ఎంపిక విషయంలో పరిస్థితులు అనుకూలించక వాయిదా పడింది. అందువల్ల ఈ సినిమా తమిళంలో మొదట విడుదలవుతుంది. తరవాత శంకర్ సహాయ దర్శకుడు ఈ సినిమాను తెలుగులో రూపొందిస్తాడని తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X