మాయమాటలు చెప్పి పవర్‌స్టార్‌ ఉచ్చులో...

By Srikanya

Srinivasan
చెన్నై : ప్రముఖ నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌పై రోజురోజుకు ఉచ్చు బిగిస్తోంది. పవర్‌స్టార్‌ వద్ద పనిచేసిన ఏజెంట్‌లను కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నగదు అవసరమైన వారిని గుర్తించే బాధ్యతను పవర్‌స్టార్‌ తన ఫైనాన్స్‌ సంస్థలో ఏజెంట్‌లుగా వ్యవహరిస్తున్న వారికి అప్పగించినట్లు, వారంతా బాధితులకు మాయమాటలు చెప్పి పవర్‌స్టార్‌ ఉచ్చులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

వారిని కూడా అరెస్టు చేసేందుకు జాబితా రూపొందిస్తున్నారు. వీరిలో ముఖ్యులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు, చెన్నైకి చెందిన క్రిష్టోఫర్‌ అని గుర్తించారు. తాజాగా ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. నగదు మోసం కేసుల్లో అరెస్త్టెన పవర్‌స్టార్‌ ప్రస్తుతం వేలూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే.

తమను కూడా ఆయన మోసం చేశాడంటూ బాధితులు రోజూ నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఛండీగర్‌కు చెందిన జగదీష్‌సింగ్‌ ఇలా ఇచ్చిన ఫిర్యాదులో.. తనకు రూ.200 కోట్ల రుణం ఇప్పిస్తానని పవర్‌స్టార్‌ నమ్మించాడని ఆరోపించారు. ముందుగానే తన వద్ద రూ.రెండు కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు.

తాను కూడా రూ.రెండు కోట్లకు మోసపోయానని కోవైకు చెందిన రాథోడ్‌, రూ.90 లక్షలకు మోసపోయానని బెసెంట్‌నగర్‌కు చెందిన జగన్నాథన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు... పవర్‌స్టార్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X