భార్యతో అదే చివరి సారి అంటున్న యంగ్ హీరో
రజనీ అల్లుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో '3' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధనుష్ స్వయంగా రాసి పాడిన 'కొలవెరి' పాట పుణ్యమా అని ఐశ్వర్య దర్శకత్వం గురించి దేశం మొత్తం తెలిసి పోయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
అయితే...భార్య ఐశ్వర్య దర్శకత్వంలో తను చేసే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా ఇదే అంటున్నాడు ధనుష్. దర్శకురాలిగా ఆమె ఎంతో ప్రతిభ ఉందని, ఇది తనతోనే ఆగకుండా అందరి హీరోలతో ఆమె పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇక పోతే ధనుష్ కొలవెరి పాట దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. అతి తక్కువ కాలంలో కోట్లాది హిట్స్ తో యూట్యూబ్ గోల్డ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ పాటకు వచ్చిన పాపులారిటీతో ధనుష్-ఐశ్వర్యకు ప్రధాని ఆతిథ్యం కూడా లభించింది.


Click it and Unblock the Notifications











