30 Years of Baashha: భాషా మూవీ రీ రిలీజ్.. రజనీకాంత్ మూవీ విడుదల ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్, నగ్మా, రఘువరన్, జనక్‌రాజ్, దేవన్ తదితరులు నటించిన చిత్రం భాషా. ఒక్కసారి చెబితే ఈ బాషా వందసార్లు చెప్పినట్టే అనే డైలాగ్‌తో కల్ట్ అండ్ ఐకానిక్ మారిన మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆర్ఎమ్ వీరప్పన్, వీ రాజమ్మాల్, వీ తమిళగన్ నిర్మించారు. ఈ సినిమాను సత్య మూవీస్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా 1995 జనవరి 12 తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్ల సందర్భంగా ఈ సినిమాను 4K వెర్షన్‌లో జూలై 18వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సాధారణమైన మాణిక్యం అనే వ్యక్తి మాణిక్ భాషాగా మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనే కథతో రూపొందిన భాషా సినిమాను సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా తొలి ఆట నుంచే మ్యాజిక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. ఈ సినిమా తమిళనాడులో ఏడాది పాటు ఏకధాటిగా ఆడింది. ఈ సినిమా తమిళంలోనే 22 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అయితే ఈ సినిమాను నిర్మించిన సత్యా మూవీస్ ఈ ఏడాదిలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండగా.. బాషా చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకొంటున్నది. ఈ నేపథ్యంలో ఈ మూవీని 4K వెర్షన్‌లోకి మార్చి లేటెస్ట్ టెక్నాలజీతో డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో రిలీజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా జూలై 18వ తేదీన 100 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సందర్భంగా బాషా సినిమా గురించి సత్య మూవీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. బాషా కల్ట్ క్లాసిక్. ఈ సినిమా జూలై 18వ తేదీన రీ రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను సౌండ్ ట్రాక్‌ను అట్మాస్‌లో రీమాస్టర్ చేసి గ్రౌండ్ బ్రేకింగ్ చర్యలు చేపట్టడం తమిళనాడు సినిమా రంగంలో రికార్డుగా మారింది. ఈ సినిమా గొప్ప సినిమాటిక ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది అని వెల్లడించింది.
భాషాతోపాటు ఇదయక్కని సినిమాను కూడా 4K డాల్బీ అట్మాస్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆర్ఎంవీ: ది కింగ్ మేకర్ (నిర్మాత ఆర్ఎం వీరప్పన్) సినిమాను రీ మాస్టర్ చేస్తాం. ఈ డాక్యుమెంటరీలో స్పూర్తిని ఇచ్చిన నిర్మాతకు సంబంధించి పొలిటిక్, కల్చరల్ లెగసీని చూపించబోతున్నాం. ఆయనకు సంబంధించిన ఫుటేజ్‌ను బయటకు తీసి.. 4K టెక్నాలజీతో రీ మాస్టర్ చేస్తున్నాం అని చెప్పారు.


Click it and Unblock the Notifications











