'సూపర్ స్టార్' బిరుదు ఇచ్చి 35 ఏళ్ల నుంచి ఎదురుచూస్తే ఇన్నాళ్లకు

By Srikanya

చెన్నై : సూపర్ స్టార్ తో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. అయితే అందుకోసం సుధీర్ఘ కాలం అంటే 35 సంవత్సరాలు పాటు ఎదురుచూడటం అంటే మాటలు కాదు. అంటువంటి అరుదైన ఫీట్ నే కలైపులి ఎస్‌.థాణు చేసారు. ఆయన ఎదురుచూపు కు ఇన్నాళ్ళకు ఫలితం లభించింది. ఆయన నిర్మాతగా రజనీ హీరోగా చిత్రం త్వరలో మొదలవుతోంది. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన వచ్చి ఆయన్ని ఆనందంలో ముంచెత్తుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రజనీకాంత్‌ అభిమానిగా నిర్మాణరంగంలో అందరికీ సుపరిచితులైన ఆయన... ప్రస్తుతం నిర్మాతల మండలికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. రజనీకాంత్‌కు 'సూపర్‌స్టార్‌' అనే బిరుదును ఇచ్చింది కూడా ఆయనే! 40 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన థాణు.. రజనీకాంత్‌ నటించిన 'భైరవి' చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేశారు.

ఇందులో రజనీకాంత్‌ పేరు ముందు 'సూపర్‌స్టార్‌'ను చేర్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత రజనీకాంత్‌ నటించిన 'అన్నామలై', 'ముత్తు', 'బాషా' చిత్రాలను థాణు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల నిర్మించలేకపోయారు. ఇప్పుడు ఏకంగా 35 సంవత్సరాల తర్వాత ఆ అవకాశం దక్కింది. ఈ చిత్రానికి రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

 35 years dream to produce a Rajinikanth film is now come true

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, పా రంజిత్‌ దర్శకత్వంలో నటించనున్నారు. కలైపులి ఎస్‌ ధాను నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కథ, దర్శకత్వం పా రంజిత్‌. రజనీ పబ్లిసిస్ట్‌ రియాద్‌ కె.అహ్మద్‌, రజనీ కూతురు సౌందర్య ట్విట్టర్‌ ద్వారా వివరాలను వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మలేషియాలో ప్రారంభమనుంది. 60 రోజులు మలేషియాలో షూటింగ్‌ తర్వాత థాయ్‌ల్యాండ్‌, హాంగ్‌కాంగ్‌తోపాటు చెన్నైలో షూటింగ్‌ చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్. రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట.

పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మెప్పిస్తుందేమో చూడాలి.

యథార్థ కథల ఆధారంగా వాస్తవికత ఉట్టిపడే 'అట్టకత్తి', 'మెడ్రాస్‌' చిత్రాలను తెరకెక్కించిన ఆయనకు రజనీకాంత్‌ అవకాశం ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యపడుతున్నరు. అంతేకాకుండా రజనీకాంత్‌ సినిమా అంటే ఇతర సాంకేతిక విభాగాల్లో ఏఆర్‌ రెహ్మాన్‌, వైరముత్తు గుర్తుకొస్తారు. ఈ సారి రంజిత్‌ తన పూర్తి జట్టుతోనే రజనీకాంత్‌తో కలిసి బరిలోకి దిగడం విశేషం! ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. పాటలు: కపిలన్‌, ఉమాదేవి, గానాబాలా. ఆర్ట్‌: రమలింగం: స్టంట్‌: అన్బు-అరివు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X