ఈ నాలుగూ ఈ రోజే... ఏవి హిట్టవుతాయో

By Srikanya

చెన్నై : శుక్రవారం వస్తే కోలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి భారీగానే ఉంటోంది. గత ఏడాదితో పోల్చితే.. ఈ సారి సినిమాల సంఖ్య ప్రతివారమూ పెరుగుతోంది. మూడు తమిళ చిత్రాలు, ఓ తెలుగు, ఓ ఆంగ్ల చిత్రం శుక్రవారం తెరపైకి రానున్నాయి. విక్రంప్రభు హీరోగా నటించిన 'శిఖరం తొడు', కృష్ణ హీరోగా 'వానవరాయన్‌ వల్లవరాయన్‌', 'బర్మా', రవితేజ నటించిన 'పవర్‌' సినిమాలు తెరపైకి రానున్నాయి.

డిఫెరెంట్ కథాంశాలు, విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాలు నిర్మితమయ్యాయని చెప్తున్నారు. తమిళంలోని పెద్ద హీరోల సినిమాలు ఏవీ విడుదల కాకపోవటంతో ఓపినింగ్స్ పెద్దగా ఉండవని భావిస్తున్నారు. అయితే చిన్న సినిమాలకూ ఇప్పుడు తమిళంలో మంచి మార్కెట్ ఉంటుందనే విషయం గుర్తించుకోవాలని చెప్తున్నారు.

'వానవరాయన్‌ వల్లవరాయన్‌'

'వానవరాయన్‌ వల్లవరాయన్‌'

'కళుగు', 'యామిరుక్క భయమే' చిత్రాలతో కోలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు కృష్ణ. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'వానవరాయన్‌ వల్లవరాయన్‌'. బుల్లితెర నటుడు మాపాకా ఈ సినిమాలో కృష్ణకు తమ్ముడిగా నటిస్తున్నారు. అల్లరల్లరి చేసే ఓ అన్నదమ్ముల కథతో దీన్ని రూపొందించారు. తాజాగా 'యామిరుక్క భయమే'తో అందర్నీ భయపెట్టించిన కృష్ణ.. ఇందులో అన్నదమ్ముల అనుబంధాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత షావుకారు జానకి ఇందులో నటించడం విశేషం. రాజమోహన్‌ దర్శకత్వంలోని ఈ సినిమాకు యువన్‌శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు.

'బర్మా'

'బర్మా'

మరోవైపు స్కొయర్‌ స్టోన్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై సుదర్శన్‌వెంబుట్టి నిర్మించిన 'బర్మా' కూడా శుక్రవారం తెరపైకి రానుంది. ధరణీధరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నూతన నటీనటులతో తెరకెక్కించారు.

హిట్‌ కోసం విక్రంప్రభు

హిట్‌ కోసం విక్రంప్రభు

'గుమ్కి' ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న 'నడిగర్‌ తిలగం' శివాజీగణేశన్‌ వారసుడు విక్రంప్రభు. తాజాగా విడుదలైన 'అరిమానంబి' కూడా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో మరో హిట్‌ను సొంతం చేసుకునేందుకు 'శిఖరం తొడు'గా వస్తున్నారు. మోనాల్‌గజ్జర్‌ కథానాయికగా నటిస్తోంది. ఇందులో విక్రంప్రభు తొలిసారిగా పోలీసు పాత్రలో నటిస్తుండటం విశేషం.

'పవర్‌' చూపిద్దామని..

'పవర్‌' చూపిద్దామని..

ఆ మధ్య వరుస హిట్లతో హవా చాటుకున్న రవితేజ.. ఇటీవల కాస్త వెనుకపడ్డారు. తాజాగా వచ్చిన బలుపుతో మునుపటి స్థాయి అందుకున్నారు. మరో మంచి హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. చెన్నైలోనూ ఆయనకు అభిమానులున్నారు. రవితేజ నటించిన 'పవర్‌' చిత్రం నగరంలో దాదాపు పది థియేటర్లలో విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X