For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విక్రమ్ చిత్రానికి ఇప్పటికి 40 రోజులు.. రూ.40 కోట్లు!

  By Srikanya
  |

  చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు సినిమాలంటే తమిళంలోనే కాదు,తెలుగులోనూ మంచి క్రేజు. బ్లాక్‌బస్టర్‌ దర్శకుడిగానే కాదు, భారీ బడ్జెట్‌ చిత్రాల మేకర్‌గా కూడా శంకర్‌కు పేరుంది. ఆయన రూపొందించిన వాటిలో బాయ్స్‌ మినహా జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు‌, భారతీయుడు‌, ఒకే ఒక్కడు‌, అపరిచితుడు‌, నన్బన్‌ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా 'ఐ' రూపొందిస్తున్నాడు. ఎమీ జాక్సన్‌ 'చియాన్‌' సరసన ఆడిపాడుతోంది. మలయాళ అగ్రనటుడు సురేష్‌గోపి, హాస్యనటుడు సంతానం కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.

  రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తొలుత వార్తలు వినిపించినా, ఇది రొమాంటిక్‌ ప్రేమకథ అని విశ్వసనీయవర్గాలు వెల్లడిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఎంత వ్యయంతో తెరకెక్కుతోందన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ 40 రోజుల షూటింగ్‌ కోసంవెచ్చించిన మొత్తాన్ని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల పలు సన్నివేశాల్ని తెరకెక్కించారు. విక్రమ్‌తో పాటు ఎమీ జాక్సన్‌ ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఇందుకోసం రూ.40 కోట్లు ఖర్చయిందట. కేవలం 40 రోజులకే ఇంత అయితే మొత్తం పూర్తయ్యేసరికి ఎంతకు చేరుతుందో వేచి చూడాల్సిందే అంటున్నాయి చెన్నై వర్గాలు.

  విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  Shankar who is known for his mega budget films is currently works on “I”. Vikram, Amy Jackson, Suresh Gopi, Santhanam, Ramkumar Ganesan and others starring is produced by Oscar Films Venu Ravichandran.Initially the shooting for the film took place in Chennai and Mumbai, and then the team went to China. The shooting scheduled for 40 days in China. It was found that just for 40 days they had a cost of 40 crores budget.The film is simultaneously made in Tamil and Telugu. Camera handled by P C Sriram and A R Rahman for songs composition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X