50 Years of Rajinikanth: 50 ఏళ్లపాటు సినీ సింహాసనంపై ఒకే ఒక్కడు.. రజనీ సినీ ప్రయాణంపై కమల్, అనిరుధ్ ఎమోషనల్

నిజ జీవితంలో బస్ కండక్టర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. 1975 సంవత్సరంలో అపూర్వ రాంగాంగళ్ సినిమాతో తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శివాజీ రావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్.. తన నట జీవన ప్రయాణానికి తిరుగేలేకుండా పోయింది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతులేని కథతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. 2025 సంవత్సరంలో కూలీ చిత్రంతో సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు. భాషా, నరసింహ, అన్నామలై, పెదరాయుడు, ముత్తు, బాబా, చంద్రముఖి, రోబో, కబాలీ, కాలా, పేట, దర్బార్, జైలర్, వేట్టయాన్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆలరించారు. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థాన్ని కొనసాగించిన ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ..

50 Years of Rajinikanth

50 ఏళ్లు.. ఒక సింహసనం. ఒక మనిషి. తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో కూలీ సినిమాతో గోల్డెన్ జూబ్లీని ఘనంగా సెలబ్రేట్ చేసుకొందా. ఆయనపై భగవంతుడి ఆశీస్సులు. మీ అందరి ప్రేమ ఉండాలని కోరుకొంటున్నాను అంటూ అనిరుధ్ రవిచందర్ ట్వీట్ చేశాడు.

తలైవా.. మిమ్మల్ని, మీ సినిమాలను చూస్తూ పెరిగాం. మిమల్ని అనుకరించాం. మీ అడుగు జాడల్లో నడించాం. మీ జైత్ర యాత్ర చేసిన రంగంలోనే మేము కూడా ఉండటం మాకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నాలో ఎనలేని స్పూర్తిని నింపినందుకు థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో అద్బుతమైన లెగసీని 50 ఏళ్లపాటు కొనసాగించినందుకు కంగ్రాటులేషన్స్. కూలీ చిత్రం మీ కీర్తి కిరీటంలో మరో వజ్రం అవుతుందని ఆశిస్తున్నాను అంటూ శివకార్తీకేయన్ ట్వీట్ చేశారు.


అర్ధ శతాబ్దంపాటు సినిమాటిక్ బ్రిల్లియెన్స్‌ను అందించిన నా ప్రియ మిత్రుడు రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ల అద్బుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్నారు. ఆరాధనపూర్వకంగా, ప్రేమతో నేను ఈ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్నాను. గోల్డెన్ జూబ్లీ సమయంలో కూలీ విజయం రీసౌండ్ ఇవ్వాలి. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్, ఈ సినిమాకు మూలస్థంభంలా నిలిచిన నిర్మాత కళానిధి మారన్. అనిరుధ్ అద్బుతమైన సంగీతం, నా చిరకాల మిత్రులు సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబీన్, నా ముద్దుల కూతురు శృతిహాసన్‌కు కంగ్రాట్స్ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

సినిమా రంగంలో 50 ఏళ్ల పూర్తి చేసిన నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌కు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మీతో కలిసి వెండితెర పంచుకొన్నందుకు నిజంగా గర్వంగా ఉంది. కూలీ ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. ఇక ముందు కూడా మాకు స్పూర్తిని ఇచ్చే పాత్రలతో వెండితెరపై మెరువాలని ఆశిస్తున్నాను అని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ట్వీట్ చేశారు.

50 ఏళ్ల పాటు తిరుగలేని చరిష్మా, అంకితభావం, సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ సృష్టించిన వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్‌ సార్‌కు కంగ్రాట్యులేషన్. చరిత్రలో అరుదైన మైలురాయిగా నిలిచిన ఈ సందర్భంలో ఇంకా ఎన్నో ఘనతలు సాధించాలి. కూలీతోపాటు మరెన్నో ఐకానిక్ చిత్రాలు మీరు చేయాలి అని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Read more about: rajinikanth kamal haasan mohanlal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X