సిద్ధార్థ, త్రిషలకు అవార్డులు
53వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా? చిత్రం అవార్డుల పంట పండించుకుంది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లయిన సిద్ధార్థ, త్రిషలకు ఉత్తమ నటీనటులుగా అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ సహాయ నటుడిగా శ్రీహరి, ఉత్తమ నేపథ్య గాయకుడుగా శంకర్ మహదేవన్ (చంద్రుడిలో ఉండే కుందేలు..), ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఘల్‌ఘల్‌ఘల్..), ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవ..అవార్డులు స్వీకరించారు. ఈ అవార్డులన్నీ నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా? చిత్రంలో పనిచేసినందుకు రావడం విశేషం.
ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ అవార్డు స్వీకరించారు. మహేశ్‌బాబుతో త్రివిక్రమ్ రూపొందించిన అతడు చిత్రానికి ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
సూపర్ చిత్రంలో చక్కని కామెడీ పండించిన అలీకి ఉత్తమ కమేడియన్‌గా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇంకా బాలు చిత్రంలో నటించిన నేహా ఒబెరాయ్‌కు ఉత్తమ సహాయనటి అవార్డు, అనుకోకుండా ఒక రోజు చిత్రంలో ఎవరైనా చూసుంటారా.. పాటకు ఉత్తమ గాయనిగా స్మిత, ఉత్తమ విలన్‌గా ఆశిశ్ విద్యార్థి (అతనొక్కడే) ఇతర అవార్డులు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











