Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫిలింఫేర్: అన్నియన్కే అన్నీ
శంకర్ దర్శకత్వంలో రూపొందిన అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) చిత్రం చెన్నైలో జరిగిన 53వ ఫిలింఫేర్ అవార్డులు (2005) ప్రదానోత్సవంలో అవార్డుల పంట పండించుకుంది. హీరో విక్రమ్ ఉత్తమ నటుడు అవార్డును, దర్శకుడు శంకర్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చెరో అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రానికి సంగీతం అందించినందుకు హారిస్ జైరాజ్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు, గీత రచయిత వైరముత్తుకు ఉత్తమ లిరిసిస్ట్ అవార్డు, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు సిబు సిరిల్ అందుకున్నారు.
అన్నియన్ చిత్రానికే కెమెరా నైపుణ్యం ప్రదర్శించిన రవివర్మన్, మణికందన్ ఉత్తమ కెమెరామెన్లుగా అవార్డులు అందుకోగా, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హీన్ అవార్డు స్వీకరించారు. గజనీ, మజా చిత్రాలలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటి ఆసిన్ చివరికి గజనీలో కల్పన పాత్రను చెలాకీగా పోషించినందుకు ఉత్తమ నటి అవార్డు అందుకుంది. శివకాశి చిత్రంలో ఉత్తమ విలన్‌గా ప్రకాష్‌రాజ్ తమ నాలుగో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ కమేడియన్‌గా వడివేలు (చంద్రముఖి) అవార్డు అందుకున్నారు. అదే చిత్రంలో రారా.. పాటకు ఉత్తమ గీతంగా అవార్డు లభించింది.
మళయాల చిత్రసీమలో అచువిందే అమ్మ చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించిన మీరా జాస్మిన్ తమ ఖాతాలో మరో అవార్డు జమ చేసుకున్నారు. అలాగే తన్మంత్ర చిత్రానికి గాను నటుడు మోహన్‌లాల్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది.