twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్‌పై ఐటీ రైడ్స్.. ఆ సినిమా వ్యవహారమే కారణం.. రూ. 77కోట్లు స్వాధీనం

    |

    ఇళయ దళపతి విజయ్‌పై ఐటీ రైడ్స్ జరగడం తమిళ నాట ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం. విజయ్‌పై ఐటీ రైడ్స్ అని తెలియగానే అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని రక్షణ కవచంగా నిలిచారనే వార్తలు మరింత వైరల్ అయ్యాయి. అయితే తమ హీరోపై బురద జల్లడానికి కావాలనే బీజేపీ ప్రభుత్వం ఐటీ రైడ్స్ చేయిస్తోందంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    సినీ పరిశ్రమపై ఐటీ కన్ను..

    సినీ పరిశ్రమపై ఐటీ కన్ను..

    గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీపై ఐటీ అధికారులు జులుం చూపిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రామానాయుడు స్టూడియోలో, వెంకటేష్, నాని, సుమ, లావణ్య, అనసూయ వంటి వారిపై ఐటీ రైడ్స్ నిర్వహించారు.

    వైరల్‌గా మారిన రష్మిక వ్యవహారం..

    వైరల్‌గా మారిన రష్మిక వ్యవహారం..

    టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న రష్మిక మందాన్నపై ఐటీ రైడ్స్ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఆ రైడ్స్ తనకు సంబంధించినది కాదని, తన తండ్రికి సంబంధించిందని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. ఆమెకు దాదాపు రూ. 300కోట్ల ఆస్తులున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

    తాజాగా విజయ్‌పైనా..

    తాజాగా విజయ్‌పైనా..

    తాజాగా దళపతి విజయ్ ఇంటిపైనా ఐటీ రైడ్స్ జరిగాయి. ఈయన హీరోగా వచ్చిన విజిల్ సినిమానే ఈ ఐటీ రైడ్స్‌కు కారణమని తెలుస్తోంది. విజిల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300కోట్లు కొల్లగొట్టినట్టు అప్పట్లో నిర్మాతలు ప్రకటించారు. దీంతో బిగిల్ (విజిల్) నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్‌పై ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విజయ్ ఇంటిని కూడా సోధా చేస్తోన్నట్లు టాక్.

    రూ. 77కోట్లు సీజ్..

    రూ. 77కోట్లు సీజ్..

    కోలీవుడ్‌ నటుడు విజయ్‌, సినీ ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌కు చెందిన 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా.. రూ.77 కోట్ల లెక్కతేలని నగదును స్వాధీనం చేసుకున్నారు. అన్బు చెళియన్‌కు చెందిన సంస్థలు, మదురైలోని ఆయన నివాసంలో కూడా ఈ సోదాలు జరిగాయి. నగదుతో పాటు పలు ఆస్తుల పత్రాలు, ప్రామిసరీ నోట్లు, హామీ కింద తీసుకున్న పోస్ట్‌డేటెడ్‌ చెక్కులను అధికారులు సీజ్‌ చేశారు. హీరో విజయ్‌ సదరు నిర్మాత నుంచి తీసుకున్న పారితోషికం, ఆస్తులపై పెట్టిన పెట్టుబడుల గురించి ఆరా తీయడంలో భాగంగా సోదాలు చేపట్టామని అధికారులు తెలిపారు. అయితే విజయ్ నుంచి ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది.

    English summary
    77 Crore Recovered From Financier Anbu In It Raids On Vijay. Now he is Busy With Lokesh Kangarajan Master movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X