'సెవెంత్ సెన్స్' మొదటి వారం కలెక్షన్స్
సూర్య తాజా చిత్రం సెవెంత్ సెన్స్ చిత్రం మొన్న దీపావళి రోజు విడుదలైన సంగతి తెలిసిందే.భాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లనే రాబట్టుతోంది.అందుకు కారణం సూర్య,మురగదాస్ కి తమిళనాట ఉన్న క్రేజే అని చెప్తున్నారు.దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ చిత్రం ఇప్పటివరకూ 54.9 కోట్లు సాధించిందని చెప్తున్నారు.ఇక ఆ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే...
మొదటి రోజు (బుధవారం): Rs 9.6 కోట్లు
రెండవ రోజు (గురు వారం): Rs 9.4 కోట్లు
మూడవ రోజు (శుక్ర వారం): Rs 7.8 కోట్లు
నాలగవ రోజు (శని వారం): Rs 8.3 కోట్లు
ఐదవ రోజు (ఆది వారం): Rs 8.1 కోట్లు
ఆరవ రోజు (సోమ వారం): Rs 6.1 కోట్లు
ఏడవ రోజు (మంగళ వారం): Rs 5.6 కోట్లు
మొత్తం వారం రోజులకి 54.9 కోట్లు వసూలు చేసినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











