twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్నేహితుడని నమ్మితే వెన్నుపోటు పొడిచాడు.. రచ్చకెక్కిన త్రిష సినిమా!

    |

    ఒకవైపు మీటూ ఉద్యమం తమిళ చిత్ర పరిశ్రమలో అలజడి సృష్టిస్తోంది. మరోవైపు కాపీ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సర్కార్ చిత్ర కథ కాపీ అంటూ ఇటీవల పెద్ద రచ్చ జరిగింది. కోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం చర్చల ద్వారా సద్దుమణిగింది. ఇప్పుడు మరో వివాదం ముదురుతోంది. త్రిష, విజయ్ సేతుపతి నటించిన థ్రిల్లర్ చిత్రం 96 కథ కాపీ అంటూ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. తన అసిస్టెంట్ దర్శకుడు సురేష్ రూపొందించిన కథని కాపీ కొట్టి 96 చిత్రాన్ని రూపొందించారని భారతీరాజా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

    గత కోనేళ్ళుగా

    గత కోనేళ్ళుగా

    గత కొన్నేళ్లుగా సురేష్ నా వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. మంచి కథలు రూపిందించే సత్తా అతడి వద్ద ఉంది. 96 చిత్ర కథ అతడిదే అని భారతీరాజా విమర్శిస్తున్నారు. 96 చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ కథని కాపీ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారని భారతీరాజా తీవ్రమైన విమర్శలు చేయడంతో వివాదం పెరిగింది.

    అనుమానం ఎలా పెరిగిందంటే

    అనుమానం ఎలా పెరిగిందంటే


    భారతీరాజా మాటల్లో.. నా అసిస్టెంట్ సురేష్ రాసుకున్న కథ, ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన 96 చిత్ర కథ ఒకటే. అదే సమయంలో టైటిల్ కార్డ్స్ లో మరుధపాండియన్ అనే వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడే మా అనుమానం మరింత బలపడిందని భారతీ రాజా తెలిపారు. మరుధపాండియన్ అనే వ్యక్తి సురేష్ కు, ప్రేమ్ కుమార్ కు కామన్ స్నేహితుడని అన్నారు.

    వెన్నుపోటు పొడిచాడు

    వెన్నుపోటు పొడిచాడు

    మరుధూపాండియన్ తనకు స్నేహితుడు కాబట్టి కొన్నేళ్ల క్రితం ఓ కథని అతడితో పంచుకున్నా. నమ్మించి వెన్నుపోటు పొడిచిన అతడు అదే కథని ప్రేమ్ కుమార్ కు అందించాడని సురేష్ ఆరోపిస్తున్నాడు. దీనితో వివాదం మరింత తీవ్రమైనదగిగా మారుతోంది.

    ప్రేమ్ కుమార్ వివరణ

    ప్రేమ్ కుమార్ వివరణ

    ఈ వివాదంపై 96 చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ స్పందించారు. తాము తెరకెక్కించిన 96 చిత్ర కథ ఆలోచన కేవలం ఒక్కరికే రావాలని రూల్ లేదు. ఎందుకంటే అందరి జీవితల్లో సాధారణంగా జరిగే సంఘటనలతోనే ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలని కుట్రగా భావించాల్సి ఉంటుందని అన్నారు.

    ఇంటికి పిలిచాడు

    ఇంటికి పిలిచాడు

    ఈ సమస్య మొదలైనప్పుడు భారతీరాజా మాట్లాడేందుకు తన ఇంటికి పిలిచారు. సినిమా బాగా ఆడుతున్న సమయంలో ఈ వివాదాన్ని తెరమీదికి తీసుకురావడం సరికాదని భావించి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఇందులో నా తప్పు ఉంటే వాళ్లు మాట్లాడడానికి ఇంటికి పిలిచేవాళ్ళు కాదు అని ప్రేమ్ కుమార్ తెలిపారు.

    చట్టపరమైన చర్యలకు సిద్ధం

    చట్టపరమైన చర్యలకు సిద్ధం

    ఈ వివాదాన్ని చట్ట పరంగా ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు కోర్టుకు వెళితే అక్కడే తేల్చుకుంటా అని ప్రేమ్ కుమార్ వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    96 director Prem Kumar responds to Bharathiraja's plagiarism claims. After Sarkar, Prem Kumar's 96 is also facing allegations of plagiarism from director Bharathiraja and his associate Suresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X