పైరసీ చేస్తూ థియేటర్లోనే హీరో విశాల్ టీంకు అడ్డంగా దొరికిపోయాడు!
సినిమా ఇండస్ట్రీకి పైరీ పెద్ద సమస్యగా తయారైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకరకంగా పైరసీ జరుగుతూనే ఉంది. తాజాగా తమిళ స్టార్స్ విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో తెరెకెక్కిన '96' చిత్రం పైరసీ గురైంది. పైరసీ సైట్లలో పూర్తి చిత్రం లీకైంది.
ఓ వైపు పైరసీని అరికట్టేందుకు తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు విశాల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... అతడి టీమ్‌కు ఓ వ్యక్తి '96' సినిమాను పైరసీ చేస్తూ రెండ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మినీ ఉదయం అనే థియేటర్‌లో ఈ సినిమాను తన ఫోనులో రికార్డు చేస్తుండగా... అదే థియేటర్లో ఉన్న విశాల్ టీం పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మరో వైపు ఆన్ లైన్లో దర్శనమిస్తున్న '96' సినిమాకు సంబంధించిన పైరసీ లింకులపై యాంటీ పైరసీ టీం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని ఇంటర్నెట్ నుండి తొలగిస్తూ ఎక్కడి నుండి పైరసీ జరిగిందనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.
'96' సినిమా విషయానికొస్తే సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ డ్రామా. విజయ్ సేతుపతి, త్రిష, గౌరీ జి కిషన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమిళనాడు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. నందగోపాల్ నిర్మాత.


Click it and Unblock the Notifications











