త్రిష విన్నపాన్ని పట్టించుకోలేదు... అయినా ‘96’ అదరగొడుతోంది!
విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '96' అనే తమిళ చిత్రం అక్టోబర్ 4న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ మూవీ 5వ వారంలోకి ఎంటరైన తర్వాత శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ టీవీ వారు...దీపావళి సందర్భంగా ప్రదర్శించారు.
ఓ వైపు సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంటే... టీవీలో వేయడం దారుణమని, టీవీ ప్రీమియర్ సంక్రాంతికి వాయిదా వేయాలని త్రిష కోరినప్పటికీ సన్ టీవీ వారు పట్టించుకోలేదు. టీవీలో ప్రదర్శితం అయిన ఈ చిత్రానికి మంచి రేటింగ్ వచ్చింది కూడా.
కాగా.... '96' టీవీ ప్రీమియర్ తర్వాత థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండటం చర్చనీయాంశం అయింది. గత వీకెండ్ తమిళనాడులో కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయట. దీన్ని బట్టి ఈ చిత్రానికి ఆదరణ ఏ స్థాయిలో లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

'96' చిత్రం కోలీవుడ్లో మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. కేరళలోనూ భారీ విజయం సాధించింది. ఇందులో విజయ్ సేతుపతి ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌గా నటించారు.
కాగా... టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రానా హీరోగా తెలుగులో రీమేక్ చేస్తారని టాక్. త్రిషనే తెలుగులో కూడా తీసుకోవాలని నిర్మాత భావిస్తున్నారట.


Click it and Unblock the Notifications











