6 కోట్ల ఖర్చు, 50 రోజులు అందులోనే.. స్టార్ హీరో మరో సంచలనం ఖాయమా!
ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. విజయ్ కి ఉన్న క్రేజ్ వలన ఎక్కడ షూటింగ్ కు వెళ్లినా చిక్కులు తప్పడం లేదు. విజయ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వస్తుండడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

హ్యాట్రిక్ మూవీ
విజయ్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్, తేరి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మెర్సల్ చిత్రం అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివాదాలు ఎదురైనా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఉన్న మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనితో ఈ హ్యాట్రిక్ మూవీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది.

6 కోట్ల ఖర్చు
అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి దళపతి 63 అనేది వర్కింగ్ టైటిల్. దళపతి 63 చిత్ర తదుపరి షెడ్యూల్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం 6 కోట్ల ఖర్చుతో భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో తదుపరి షెడ్యూల్ 50 రోజుల పాటు జరగనుంది. విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. క్రీడా రంగంలో జరిగే లొసుగులు, రాజకీయాలపై అట్లీ ఈ చిత్రంతో అస్త్రం సంధించబోతున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ ఎప్పుడంటే
జూన్ 22న విజయ్ పుట్టిన రోజు. విజయ్ బర్త్ డే సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళనాట విజయ్ రోజు రోజుకు సంచలనంగా మారుతున్నాడు. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం కూడా యావరేజ్ టాక్ తోనే అద్భుత విజయం సాధించింది.

దీపావళి కానుకగా
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దళపతి 63 చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలుచేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ కళాశాలలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా విజయ్ అభిమానులు ఇనుప కంచెని సైతం విరిచేసి తమ అభిమాన హీరోని చూడడానికి ప్రయత్నించారు.


Click it and Unblock the Notifications











