దేవా డైరెక్షన్ లో నయన్...! ఒక్కసారిగా అదిరిపడిన ఇండస్ట్రీ

ఏ ముహూర్తాన 2020 ప్రారంభం అయిందో కానీ, కరోనా దెబ్బకి ప్రపంచం విలవిల్లాడిపోతోంది. కానీ, ఈ సమయంలోనూ ఎంటర్టైన్మెంట్ కు ఏమాత్రం డిమాండ్ తగ్గకపోవడం విశేషం. ఇక కొత్త సినిమాల కోసం అటు జనాలు, ఇటు ఇండస్ట్రీ వాసులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ అందమైన ముచ్చట అందరికీ గిలిగింతలు పెడుతోంది. ఇంతకూ విషయం ఏమిటంటే, అందాలతార నయనతార, ప్రభుదేవా మళ్లీ కలిసి పనిచేయబోతున్నారట.

Recommended Video

Nayanthara & Prabhudeva Pair Up For A Movie ?
ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసమే ఒప్పుకున్న నయన్!

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసమే ఒప్పుకున్న నయన్!

లేడీ సూపర్ స్టార్ అవతరించిన నయన్ ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మారింది పరిస్థితి. లాక్ డౌన్ కు ముందు దర్బార్ సినిమాలో రజినీకాంత్ సరసన తళుక్కుమన్న నయన్, మళ్లీ మరో వినోదాత్మక చిత్రంతో జనాల ముందుకు రావాలని భావిస్తోంది. అయితే, ఇందుకు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితేనే కెరెక్ట్ అని భావిస్తోందట. అందుకే, ప్రభుదేవాతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది.

మరోసారి మెగాఫోన్ పట్టనున్న దేవా

మరోసారి మెగాఫోన్ పట్టనున్న దేవా

గతంలో ప్రభుదేవా,నయనతార నడుమ ఘాటు వ్యవహారమే నడించిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో వివాదాలకు కారణమైన వీరి బంధం, పెళ్లి పీటల వరకూ వెళ్లి అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ తరువాత నయన్ కాస్త బ్రేక్ తీసుకుని సూపర్ స్టార్ రేంజ్ ను అందుకుంది. ప్రభుదేవా అటు యాక్టింగ్ ను, ఇటు డైరెక్షన్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ గడిపేస్తున్నాడు. అయితే, లాక్ డౌన్ ముగుస్తూనే దేవా మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని తెలుస్తోంది. అది కూడా నయన్ కోసమేనట.

అప్పుడు ఆగిపోయినదే... ఇప్పుడు పట్టాలెక్కుతోంది

అప్పుడు ఆగిపోయినదే... ఇప్పుడు పట్టాలెక్కుతోంది

కొన్నేళ్ల క్రితం ప్రభుదేవా , నిర్మాత ఐసరాయ్ గణేశ్.. కురుప్పు రాజా వెల్లై రాజా అనే సినిమాను పట్టాలెక్కిద్దామని నిర్ణయించారు. కార్తీ, విశాల్ లీడ్ రోల్స్ చేస్తారని వినిపించింది. కానీ, అనుకోని రీతిలో ఈ సినిమా పట్టాలెక్కకుండానే అటకెక్కేసింది. అయితే ఇప్పుడు అదే సినిమాకు దుమ్ముదులిపి మళ్లీ పట్టాలెక్కించబోతున్నారని వినికిడి.

విశాల్ ను పక్కకునెట్టేసిన నయన్

విశాల్ ను పక్కకునెట్టేసిన నయన్

ఇకపోతే కార్తీ పాత్రలో అతడే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కానీ, విశాల్ పాత్రను పూర్తిగా మార్చేసి, ఆ పాత్రకు నయనతారను ఎంపిక చేశారట. ఏమైనా సినిమా కథతో పాటూ, క్యాస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక నయన్, ప్రభుదేవా మరోసారి చేతులు కలపబోతున్నారు అంటే, జనాల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X