మళ్లీ ఎ.ఆర్ రెహమాన్ ని పిలిచారు
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ త్వరలోనే ఇలయ తలబది విజయ్ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడా?... అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఆయనకు అది 58వ చిత్రం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిత్రాన్ని నిర్మిస్తున్న విజయ్ వ్యక్తిగత మేనేజర్ సెల్వకుమార్... స్వరమాంత్రికుడే బాణీలు కట్టాలని కోరుకుంటున్నట్లు కూడా వినికిడి. ఇది జరిగితే విజయ్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న రెండో చిత్రం ఇది కానుంది. 2007లో వచ్చిన అళగియ తమిళ్‌మగన్'కు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు.
ఇక ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్-సమంత జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాళ్, ధీరన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆగస్టులో చిత్రీకరణను పూర్తి చేసి దీపావళి కానుకగా ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. సంగీతం అనిరుధ్. అనంతరం శింబుదేవన్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు.

మరో ప్రక్క తాను త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై తమిళ హీరో విజయ్ స్పందించారు. అలాంటి ఆలోచన తనకు లేదని, దీని గురించి ఎవరితోనూ చర్చించలేదని పేర్కొన్నారు. 'ఇలయ తలబది' విజయ్ తన 'తలైవా' విడుదల సమయంలో రాజకీయంగా పలు సమస్యలు ఎదుర్కొన్నారని, అందువల్ల పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు, ఇందుకోసం కేరళలోని అభిమానులతో విజయ్ చర్చించారని వార్తలు వచ్చాయి.
దీనిపై విజయ్ మాట్లాడుతూ.. ''రాజకీయ అరంగేట్రం కోసం కేరళలో అభిమానులతో మాట్లాడాననే వార్తలు చదివాను. దీన్ని చూసి అభిమానులు, ప్రజలతోపాటు నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యా. అదంతా తప్పుడు సమాచారమే. వాస్తవానికి రెండు నెలలుగా 'జిల్లా' షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నా. కేరళకు వెళ్లలేదు. ఈ తరహా వార్తల వల్ల అభిమానుల్లో గందరగోళం నెలకొంటోంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలనే ఉద్దేశంతో రేయింబవళ్లు షూటింగ్‌లో పాల్గొంటున్నా. నా అభివృద్ధిలో మీడియాకు ప్రముఖ స్థానముంది. ఈ తరహా వార్తలను దయచేసి ప్రచురించి గందరగోళం సృష్టించొద్దు''అని తెలిపారు.


Click it and Unblock the Notifications











