twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఆర్ రెహమాన్‌ నిరాహార దీక్ష, క్రెడిట్ కొట్టేయాలని చూడద్దంటూ కమల్

    ఏఆర్‌ రహమాన్‌ తాజాగా జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళులకు మద్దతు తెలిపారు.

    By Srikanya
    |

    చెన్నై: జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని తమిళనాడులో గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రజలంతా పెద్ద ఎత్తున మెరీనా బీచ్‌ వద్ద నిరసనలు చేపడుతున్నారు.

    ఇప్పటికే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, విజయ్‌, విశాల్‌ తదితర ప్రముఖులు జల్లికట్టునిర్వహించాలని కోరుతున్నారు. చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. ప్రముఖ చెస్‌ క్రీడాకారుడు విశ్వనాథ్‌ ఆనంద్‌ సైతం జల్లికట్టు కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువకులకు సెల్యూట్‌ అంటూ తన మద్దతు ప్రకటించాడు.

    A R Rahman extends support to Jallikattu movement

    తాజాగా ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రహమాన్‌ తాజాగా జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళులకు మద్దతు తెలిపారు. జల్లికట్టు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం ఉపవాసం చేస్తున్నట్లు ఏఆర్‌ రహమాన్‌ వెల్లడించారు.

    ఇదిలా ఉంటే...జల్లికట్టుకు మద్దతుగా యువత చేస్తున్న ఆందోళనలో పాల్గొని వారి క్రెడిట్‌ను తారలు పొందడం సముచితం కాదని నటుడు కమల్‌హాసన్‌ అభిప్రాయపడ్డారు. చెన్నైలో యువకులు చేపడుతున్న ఆందోళనల్లో పలువురు నటీనటులు, దర్శకులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

    దీనిపై కమల్‌ స్పందిస్తూ.. తొలిసారిగా గర్వపడే స్థాయిలో యువత ఘనకార్యంలో నిమగ్నమైందన్నారు. సాధారణంగా యువకులను రాజకీయ నేతలు రెచ్చగొడతారని, అయితే ఇప్పుడు ఆ రాజకీయనేతలే ఆశ్చర్యపోయేలా యువత రంగంలోకి దిగిందని పేర్కొన్నారు.

    సినీ ప్రముఖులు వారి ఆందోళనలో పాల్గొని ఆ క్రెడిట్‌ను పొందడం సముచితం కాదన్నారు. ఇది కేవలం యువకులకు దక్కాల్సిన విజయమని, రేపటి రాజకీయ నాయకులు పలువురు అందులో ఉండొచ్చని, వారి పోరాటాన్ని అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని కమల్‌ స్పష్టం చేశారు.

    English summary
    Music Director A R Rahman has decided to support Jallikattu movement by going on a hunger strike from tomorrow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X