‘కాలా’.... రజనీకాంత్ అభిమానులకు సర్‌ప్రైజ్
రజనీకాంత్ అభిమానులు, యావత్ సౌత్ ప్రేక్షక్షులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కాలా'. తమిళనాడులో సినిమా ఇండస్ట్రీ సమ్మె కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు కూడా పెంచారు.
అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ నిర్మాత ధనుష్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఫస్ట్ సింగిల్ మే 1న సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 'కాలా' చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మే 9న చెన్నైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈ వెంటుగా దీన్ని నిర్వహించబోతున్నారు. సౌతిండియాకు చెందిన ఓ పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈచిత్రం థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసింది. ముంబై బ్యాక్ డ్రాప్‌తో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రం భారీ విజయం సాధించడంతో 'కాలా'పై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











