హన్సిక కు మొదలెట్టేసారు
తమిళనాడులో హీరోయిన్స్ కు గుడులు కట్టడం అనే విచిత్ర సంప్రదాయం ఉంది.గతంలో ఖుష్బూ,నమిత వంటి నటీమణులకు గుడులు కట్టిన అభిమానులు ఇప్పుడు హన్సికకు సైతం గుడి కట్టడానికి సిద్దమవుతున్నారు.మధురై నుంచి వచ్చిన కొందరు ఆమె అభిమానలు ఆమెతో ఈ ప్రపోజల్ పెట్టారు.అయితే హన్సిక డైరక్ట్ గా కట్టవద్దని చెప్పకుండా తాను తన అభిమానుల మనస్సులు బాధపెట్టలేనని,వారు ప్రేమ తనకు బలాన్ని ఇస్తోందని,అయితే తన మీద వీరాభిమానంతో ఎక్కడ వారు తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుని వృధా చేస్తారనే భయం ఉందని అంది.అంతేకాక మనుష్యులను దేముళ్ళుగా ఆరాధించటం తనకు నచ్చదని అది తన ఫ్యాన్స్ గుర్తించుకోవాలని చెప్పుకొచ్చింది.ఆ డబ్బుని ఏ పేద పిల్లల చదువుకో, చిన్న కుటుంబాల ఎదుగులకో ఖర్చు పెడితే తాను బాగా సంతోషిస్తానని అంది.ఇక హన్సిక రీసెంట్ గా తెలుగులో నటించిన కందిరీగ చిత్రం మంచి విజయం సాధించింది.అలాగే ఆమె సిద్దార్ద సరనస దిల్ రాజు నిర్మాతగా చేస్తున్న ఓహ్ మై ప్రెండ్ చి్త్రం కూడా షూటింగ్ జరుగుతోంది.తమిళంలో విజయ్ సరసన వేలాయిధం చిత్రంలో చేస్తోంది.వేలాయుధం చిత్రం తెలుగులో గతంలో నాగార్జున చేసిన అజాద్ కు రీమేక్.


Click it and Unblock the Notifications











