మరో సారి 'గజిని' కాంబినేషన్
'గజిని' చిత్రంలో కలసి నటించిన సూర్య, నయనతార మరో సారి వెండి తెరపై కనువిందు చెయ్యనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తమిళంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. 'ఆదవన్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తు, నరసింహా, దశావతారం వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాలను అందించిన కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పుడీ చిత్రం తెలుగులో అనువాదమవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ ఎన్.ఆర్.క్రియేషన్స్ అధినేత చందన రమేష్ దక్కించుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని చందన రమేష్ చెప్పారు.
surya nayantara ksravi kumar surya so krishnan veedokkade tamanna anjaneyulu ravi teja ghajini asin కెయస్రవికుమార్ గజిని సూర్య నయనతార ఆంజనేయులు రవితేజ అసిన్ వీడొక్కడే తమన్నా


Click it and Unblock the Notifications