కొత్త అవతరామెత్తిన ఆది పినిశెట్టి.. వీడియో వైరల్
నాటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి. అయితే ఏనాడూ కూడా బ్యాక్ గ్రౌండ్ కార్డ్ వాడుకోలేదు. తన దగ్గరికి వచ్చిన పాత్రను చేశాడు. అది హీరోగానా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానా, విలన్‌గానా అని చూడలేదు. ఓ పరిపూర్ణ నటుడిగా మారి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించాడు. సరైనోడు, రంగస్థలం లాంటి చిత్రాల్లో అసాధారణమైన నటనను కనబర్చి అందర్నీ ముగ్దుల్ని చేశాడు. తెలుగులో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న ఆది.. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యాడు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ స్థంభించిపోయింది. దీంతో షూటింగ్‌లు అన్నీ ఆగిపోయాయి. దాదాపు వంద రోజులు తారలంతా ఇంటి పట్టునే ఉంటూ వచ్చారు. ఈ సమయంలో వారి టాలెంట్‌కు పదును పెట్టారు. కొందరు కండలు పెంచే బిజీలో ఉంటే మరికొందరు ఫ్యామిలీకి సాయం చేసేవారు.. ఇంకొందరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉండేవారు. అయితే ఆది మాత్రం కొత్త రూట్లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది.

రవిరాజా పినిశెట్టి కోసం ఆది హెయిర్ స్టైలిస్ట్‌గా మారాడు. ఆయనకు హెయిర్ కట్ చేసి, క్లీన్ షేవ్ చేశారు. తన తండ్రికి షేవింగ్ చేస్తున్న వీడియోను ఆది సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షేవింగ్ అయిపోయిన అనంతరం ఆదికి ఆయన తండ్రి డబ్బులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆది ప్రస్తుతం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి', కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో 'క్లాప్' సినిమాలు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











