హాస్పటిల్ పాలైన 'గుండెల్లో గోదారి' హీరో
ఏకవీర చిత్రంతో ఈ మద్యన పలకరించిన ఆది పినిశెట్టి తాజాగా పుడ్ పాయిజనింగ్ జరిగి హాస్పటిల్ లో చేరినట్లు సమాచారం. చెన్నైలోని విజయ హాస్పటిల్ లో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కడుపులో నొప్పి విపరీతంగా రావటంతో హాస్పటిల్ కి వెళితే ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు కనుక్కున్నారు. రెండు రోజులు రెస్ట్ తీసుకుని,మందులు వాడితే సరిపోతుందని వైద్యలు సూచించారు. ఇక ఆదిపినిశెట్టి..ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి గారి కుమారుడు. ఇక ప్రస్తుతం ఆది పినిశెట్టి తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న గుండెల్లో గోదారి చిత్రం చేస్తున్నారు.
మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి' చిత్రం షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. ఆది పినిశెట్టి, తాప్సీ, లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నాగేంద్రకుమార్ దర్శకుడు. చిత్రం ప్రోగ్రెస్‌ని లక్ష్మీప్రసన్న వివరిస్తూ ' ఇప్పటి వరకూ 70 శాతం చిత్రం పూర్తయింది. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న మ్యూజికల్ థ్రిల్లర్ ఇదని చెప్పవచ్చు. జూన్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.
అలాగే ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ కూడా హైలెట్ కాబోతోంది.రాజమండ్రి సమీపంలో ఈ సాంగును చిత్రీకరించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన పిఎస్3 (ప్లే స్టేషన్3)ను ముమైత్‌కి గిఫ్టుగా ఇచ్చింది. ఈ విషయాన్ని ముమైత్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా సయంగా వెల్లడిచింది. 'మంచు లక్ష్మి తనకు అమేజింగ్ గిఫ్ట్ ఇచ్చింది. పిఎస్3 చాలా బాగుంది, మంచు లక్ష్మిది చాలా మంచి మనసు, ఆమె ప్రాజెక్టులో భాగస్వామిని కావడం..ఎంతో సంతోషంగా ఉంది' అంటూ ముమైత్ పేర్కొంది.
ఈ చిత్రంలో సెక్సీ గర్ల్ తాప్సీ తోపాటు, ఆది పనిశెట్టి కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రం చిత్తీకరణ జరుపుతున్నారు. పాలాని కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మురళి కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. మే నెల కల్లా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











