రజనీకాంత్ చిత్రంలో తెలుగుహీరో కీ రోల్
పెద రాయుడు వంటి సూపర్ హిట్స్ తీసిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది తెలుగు, తమిళంలోనూ హీరోగా విజయాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనికి రజనీకాంత్ కొత్త చిత్రం 'కొచ్చాడయాన్'లో కీ రోల్ ఆఫర్ వచ్చిందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం. ఈ చిత్రానికి రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న చెన్నైలో చిత్రీకరణ మొదలవుతుంది. ఇందులో స్నేహ హీరో చెల్లెలుగా కనిపించబోతోంది. వారి మధ్య వచ్చే సన్నివేశాల్ని తొలి రోజు చిత్రిస్తారు. కేఎస్ రవికుమార్ కథను అందించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తారు. ఆది ఇటీవల తమిళంలో నటించిన 'అరవన్'(ఏకవీర)చిత్రం చూసి 'కొచ్చాడయాన్'కి ఎంపిక చేసుకొన్నారు.
ఇక ఈ త్రీడి చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్.. రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక 'రాణా'సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా ఆరోగ్య సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











