బిగ్‌బాస్ సెన్సేషన్‌ ఓవియాతో టాలీవుడ్ హీరో రొమాన్స్.. చెన్నైకి మకాం..

తండ్రి నట వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆది నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలను ఎంచుకొని కష్టపడుతున్నా భారీ విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇలాంటి ప

By Rajababu

Recommended Video

బిగ్‌బాస్ కంటెస్టేంట్ తో టాలీవుడ్ హీరో రొమాన్స్..

తండ్రి నట వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆది నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలను ఎంచుకొని కష్టపడుతున్నా భారీ విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆది పెద్ద సాహసమే చేస్తున్నాడు. అదేమిటంటే ఆది తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తుండటమే..

నెక్ట్స్ నువ్వే చిత్రంలో

నెక్ట్స్ నువ్వే చిత్రంలో

మల్టీస్టారర్‌గా రూపొందిన శమంతకమణి చిత్రంలో ఆది నటించాడు. ఆ చిత్రంలోని పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం నెక్ట్స్ నువ్వే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఈటీవీ ప్రభాకర్ దర్శకుడు. రష్మీ కథానాయిక. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఆది సరసన ఓవియా హెలెన్

ఆది సరసన ఓవియా హెలెన్

తెలుగులో వరుస చిత్రాలు చేస్తూనే తమిళంలో ఓ చిత్రాన్ని చేసేందుకు అంగీకరించాడు. హారర్ చిత్రంగా రూపొందనున్న కాట్టేరిలో నటించేందుకు ఆది గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియా హెలెన్ కథానాయిక. అక్టోబర్ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి యామిరుక్క భయమే (ఫేం) దీకేయ్ దర్శకుడు.

బిగ్‌బాస్‌లో ఓవియా రచ్చ రచ్చ

బిగ్‌బాస్‌లో ఓవియా రచ్చ రచ్చ

కాట్టేరి చిత్రంలో నటిస్తున్న ఓవియా హెలన్‌ను తమిళ బిగ్‌బాస్ రచ్చ రచ్చ చేసింది. ఇంటి నుంచి బయటకు పంపించాలని గొడవ చేసిన ఓవియా.. ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను బిగ్‌బాస్ నుంచి బయటకు పంపించారు.

ఓవియాకు భారీగా ఆఫర్లు

ఓవియాకు భారీగా ఆఫర్లు

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓవియాకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ప్రస్తుతం కనీసం ఆరు చిత్రాలు చేతిలో ఉన్నట్టు తెలుస్తున్నది. హరహర మహాదేవకి చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ జయకుమార్ చిత్రాన్ని కూడా అంగీకరించినట్టు సమాచారం. ఇటీవల విడుదలైన హరహర మహాదేవకి చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X