'మగధీర'ను మించిపోయే కథతో

By Srikanya

రామ్ చరణ్,రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా రికార్డును బ్రద్దలు కొట్టడానికా అన్నట్లు తమిళంలో 'అరావన్‌'చిత్రం తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి దర్సకుడు వసంత్ బాలన్.వసంత్ గతంలో తీసిన 'అంగడితెరు' చిత్రం తెలుగులో షాపింగ్‌మాల్‌గా విడుదలైంది.అలాగే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది హీరోగా చేస్తున్నాడు.ఆది హీరోగా చేసిన మృగం చిత్రం గతంలో తెలుగులో విడుదలై ఇక్కడ కూడా బాగా ఆడింది.ఇక ఈ 'అరావన్‌'చిత్రమే తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. 200 సంవత్సరాల క్రితం మధురై ప్రాంతంలో జరిగిన అడవిబిడ్డల కథ ఇది.

రోజు రోజుకీ మనిషి మరింత బలవంతుడవుతున్నాడు. కానీ మనసు మరింత కుంచించుకుపోతుంది. సమూహంగా పోరాడే తత్వాన్ని విడనాడి, సమూహాన్ని విడగొట్టే పద్ధతుల్ని ఎంచుకుంటున్నాడు. ఈ విషయాన్నే తమిళ దర్శకుడు వసంతబాలన్‌ 'అరావన్‌' చిత్రంలో చూపాలనుకుంటున్నాడు. వందల సంవత్సరాల క్రితం ప్రకృతి బలంగా ఉన్న సమయంలో మనిషి ఎలా ప్రవర్తించాడన్నది... చారిత్రాత్మకంగా తీయ బోతున్నారు. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.

మహాభారతంలో అర్జునుడి కొడుకు పేరే అరావన్‌. పాండవుల విజయం కోసం ఒకరు ప్రాణ త్యాగం చేయాల్సిన సమయంలో అరావన్‌ ముందుకొచ్చాడని కథ ఉంది. అంతటి ధీరుడి పేరును తన చిత్రానికి టైటిల్‌గా ఉండాలని దర్శకుడు వసంతబాలన్‌ నిర్ణయించారు. అంతేగానీ మహాభారత కథకు, అర్జునుడి కుమారుడికి...సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రాణాలు త్యాగం చేయటం అనే విషయంలో మాత్రం పోలిక ఉంది.

కొండ ప్రాంతంలో 18వ శతాబ్దం వాతావారణాన్ని ప్రతిబింబించేలా 80 లక్షల రూపాయలతో నిర్మించిన భారీ సెట్‌లో ఆరవన్ చిత్రం షూటింగ్ జరుపుతున్నట్లు దర్శకుడు వసంతబాలన్ తెలిపారు.నాటి వాతావరణాన్ని ప్రతి బింబించేలా మదురై సమీపంలోని అరిడాపట్టి అనే కొండ ప్రాంతంలో 80 లక్షల ఖర్చుతో 100 గుడిసెలు, కరుప్పన్ ఆలయంతో కూడిన గ్రామసెట్‌ను వేసినట్లు తెలిపారు.ఇందులో చిత్రం లోని ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. యువ గాయకుడు కార్తీక్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X