ట్రెండింగ్: స్టార్ హీరో తనయుడి వైరల్ ఫొటోలు.. ఎంత క్యూట్‌గా ఉన్నాయో!!
అమాయకపు బొసి నవ్వులు కురిపిస్తున్న ఈ చిన్నారిని చూడండి. భలే ముద్దుగా ఉన్నాడు కదా! పాలబుగ్గులతో ముసిముసినవ్వులు నవ్వుతున్న ఈ చిన్నారి తమిళ అగ్రహీరో అజిత్-షాలినీ దంపతుల ముద్దుల తనయుడు ఆద్విక్. ప్రస్తుతం ఆద్విక్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల తల్లి షాలినీతో కలిసి ఆద్విక్ బయట కనిపించారు. ఈ సమయంలో అజిత్ ఫ్యాన్ ఒకరు వారిని గుర్తించి.. సెల్ఫీ దిగుతానని అభ్యర్థించారు.

అజిత్ ఫ్యాన్ కోరికను
అజిత్ ఫ్యాన్ కోరికను కాదనలేక షాలినీ సమ్మతించడంతో వారిద్దరితో కలిసి అతను ఓ సెల్ఫీ దిగాడు. అంతేకాకుండా క్యూట్ క్యూట్‌గా నవ్వుతూ పోజులిచ్చిన ఆద్విక్ ఫొటోలు కూడా అతను క్లిక్‌మనిపించారు. ఆద్విక్‌అజిత్ యాష్‌ట్యాగ్ (#AadvikAjith)తో పోస్టు చేసిన ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఈ క్యూట్ ఫొటోలను షేర్‌చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అద్విక్ అజిత్ గురించి
అజిత్-షాలినీ దంపతులకు కూతురు అనౌష్క, కొడుకు ఆద్విక్ ఉన్నారు. 2015 మార్చి 2న ఆద్విక్ వీరికి ఆద్విక్ జన్మించాడు. ఆద్విక్ పుట్టినప్పుడు కూడా అజిత్ ఫ్యాన్స్ ఇదేవిధంగా తమ ఆనందం పంచుకుంటూ.. కుట్లీతలా యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు. అప్పట్లో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల దృష్టిని కూడా ఇది ఆకర్షించింది.

అజిత్ దంపతుల కూతురు
ఇక, అజిత్ దంపతులకు 2008లో అనౌష్క పుట్టింది. కొన్నిరోజుల కిందట అనౌష్క పదో పుట్టిన రోజును బంధుమిత్రుల సమక్షంలో అజిత్ ఘనంగా నిర్వహించారు. కోలీవుడ్ స్టార్ కిడ్స్‌కు సంబంధించి.. అనౌష్క, ఆద్విక్‌లకు స్పెషల్ క్రేజ్‌ఉంది.

అజిత్ 60వ చిత్రం కోసం
ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ హీరోగా తెరకెక్కిన `విశ్వాసం` సినిమా పెద్ద సూపర్‌హిట్ అయింది. రీసెంట్‌గా విడుదల చేసిన నెర్కొండ పార్వై సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ `పింక్` సినిమాకు ఇది రీమేక్. ప్రస్తుతం దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించే తన 60వ చిత్రం కోసం అజిత్ రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











