గజిని హిందీ వెర్షన్‌లో అమీర్‌ఖాన్
తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన గజిని హిందీ రీమేక్‌లో అమీర్‌ఖాన్ నటించనున్నాడు. ఆ సినిమా చూసి చలించిపోయిన అమీర్ దానిని సొంతంగా హిందీలో నిర్మించడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. తమిళ తంబి మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే అమీర్‌ఖాన్, మురుగదాస్ ఇద్దరూ ఈ సంవత్సరమంతా బిజీగా ఉండడంతో వచ్చే ఏడాది కానీ ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం లేదు. హిందీలో ఇతర నటీనటులను ఎంపిక చేయవలసి ఉంది. హిందీ గజిని ప్రారంభమయ్యేలోపు అమీర్‌ఖాన్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సినిమాను పూర్తి చేసుకోవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications