twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్ ముఖం అలా ఉందంటూ దారుణంగా ట్రోలింగ్.. కౌంటర్ అదిరింది!

    |

    సెలెబ్రిటీలకు ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా హీరోయిన్లు నెటిజన్ల విమర్శలకు గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో నెటిజన్ల నుంచి హీరోయిన్లకు అనవసరమైన కామెంట్స్ ఎదురవుతుంటాయి. యంగ్ హీరోయిన్ ఆత్మిక తాజాగా ట్రోలింగ్ కు గురైంది. దారుణమైన ట్రోలింగ్ చేసిన సదరు నెటిజన్ కు ఆత్మిక అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఆత్మిక ఫోటోని వేరే హీరోలతో పోల్చుతో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీని గురించే ఈ రచ్చంతా జరిగింది.

     తమిళ చిత్రాలతో

    తమిళ చిత్రాలతో

    ఆత్మిక తమిళ చిత్రం మీసయా మురుక్కు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నారగ సూరన్ చిత్రంలో నటించింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు కోసం ఆత్మిక ప్రయత్నిస్తోంది. ఆత్మిక అందంగా లేదనే ఉద్దేశంతో ఆమెని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. ఆడవేషంలో ఉన్న హీరోలతో ఆమె ఫోటోని పోల్చుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ పోస్ట్ ఆత్మిక కంటబడడంతో గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

    చాలా సంతోషం

    చాలా సంతోషం

    హీరో విక్రమ్ మల్లన్న చిత్రంలో ఆడవేషంలో కనిపించిన ఫొటోతో ఆత్మికని సదరు వ్యక్తి పోల్చాడు. మరికొందరు నటులు ఆడవేశాల్లో ఉన్నా ఫోటోలని కూడా పోస్ట్ చేశాడు. దీనికి ఆత్మిక స్పందిస్తూ.. డియర్ బ్రదర్.. ఈ లెజెండ్స్ తో నన్ను పోల్చినందుకు చాలా సంతోషం. నేను తెలియజేస్తున్న ఈ స్పందన నీకోసం మాత్రమే కాదు.. నీలా ఆలోచించే ప్రతి ఒక్కరికి.

    క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే!క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే!

    ఏమాత్రం బాధపడను

    ఈ ఫోటోలని నేను చూసి బాధ డుతానని అనుకుంటున్నావా. నేను బాధ పడను. నేనునీ గురించి బాధ పడుతున్నాను. మనుషులు ఇలాగే ఉంటారని నువ్వు చిన్ననాటి నుంచి భ్రమలో ఉంటున్నట్లున్నావు. అంతకంటే ముందుగా నువ్వు ఎంతటి అడగాడివో నేను చూడాలని అనుకుంటున్నా. నువ్వు హృతిరోషన్ లా అందంగా ఉన్నా నాకు నచ్చవు. ఎందుకంటే నీకు అందమైన హృదయం లేదు అని ఆత్మిక సదరు వ్యక్తిపై విమర్శలు చేసింది.

    ఉమెన్స్ డే రోజు

    ఉమెన్స్ డే రోజు

    సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్ ని నేను పట్టించుకోను. ఈ రోజు ఉమెన్స్ డే. మహిళల పట్ల నీకున్న అభిప్రాయం మారాలనే స్పందిస్తున్నా అని ఆత్మిక తెలిపింది. మహిళలు ఇలాగే ఉండాలని ఎవరూ కండిషన్ పెట్టలేరు. పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా ఎవరికి వారు అందగానే ఉంటారు అని ఆత్మిక తెలిపింది.

    English summary
    Aathmika destroys troll who compares her to a man with epic post
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X