ఎదురుచూపులకు తెర.. గుడ్ న్యూస్ చెప్పిన అభిజిత్.. పులి వేట మొదలు!
అభిజిత్ అనే పేరు గురించి, ఆ వ్యక్తి గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బిగ్ బాస్ షో కంటే ముందు అయితే అభిజిత్ ఎవరు? అని అమాయకంగా అడిగిన వారుంటారు. కానీ బిగ్ బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు అభిజిత్. ఓ వ్యక్తిగా ఎలా ఉండాలి.. పరిణతి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అభిజిత్‌ను చూపించొచ్చు అనేంతగా ఎదిగిపోయాడు. బిగ్ బాస్ విజేతగా అభిజిత్‌కు ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది.

బిగ్ బాస్ షోలో అలా..
బిగ్ బాస్ షోలో అభిజిత్ ఆడిన ఆట అంతా ఒకెత్తు అయితే.. మొదటి నుంచి చివరకు ఒకేలా ఉండి.. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడంతో అందరూ ఫిదా అయ్యారు. ఎక్కడా కూడా అతిని ప్రదర్శించకుండా.. ఎక్కడ ఎలా మాట్లాడాలి.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. చివరకు బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేతగా నిలిచాడు.

సినిమా కోసం..
బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్‌ను చక్కగా వాడకుని ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయాలని అభిజిత్ బాగా ప్రయత్నిస్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తరువాత మళ్లీ అభిజిత్ తెరపై కనిపించలేదు. అందుకే ఇలా బిగ్ బాస్ ఇమేజ్‌తో మంచి హిట్ కొట్టేసి స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

స్క్రిప్ట్ కోసం కసరత్తు..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచీ అభిజిత్ తనకు సరిపోయే కథ, స్క్రిప్ట్ కోసం వెదుకులాట ప్రారంభించాడు. రోజంతా కూర్చుని కథలు వింటూ ఉండేవాడట. కంటిన్యూగా రెండు మూడు గంటలు కథలు వింటూ ఉన్నానని సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని అభిజిత్ తెలిపాడు.

అందరూ బిజీగా..
అయితే సోహెల్, దివి, అరియానా, అఖిల్, మోనాల్ వంటి వారంతా కూడా తమ తమ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేశారు. సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ అభిజిత్ ఒక్కడే కాస్త ఆలస్యం చేస్తున్నాడు. దీంతో అభిమానులు గత రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. అప్డేట్ ఎప్పుడు చెబుతాడా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అప్డేట్ అంటూ..
అయితే తాజాగా అభిజిత్ మాత్రం ఓ పోస్ట్ చేశాడు. అందులో సింపుల్‌గా తాను చెప్పాల్సింది చెప్పేశాడు. రేపే అనౌన్స్ మెంట్స్ చూస్తూనే ఉండండి అంటూ చెప్పేశాడు. ఇక ఈపోస్ట్‌తో అభిమానులు చెలరేగిపోతోన్నారు.పులి వేట మొదలైంది.. కొత్త సినిమా అప్డేట్లు రాబోతోన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











