For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూగ అమ్మాయితో సాధ్యమా అన్నారు..ఐనా

    By Srikanya
    |

    రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ కాంబినేషన్లో మొన్న సంక్రాంతికి వచ్చిన శంభో శివ శంభో చిత్రం గుర్తుండే ఉంటుంది. అందులో రవితేజ చెల్లిగా చేసిన అభినయ ఓ మూగ పిల్ల. ఆమెకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు...ఆ చిత్రం ఒరిజనల్ నాడోడిగల్ కి వచ్చింది. విజయ్ టీవి నాలువ ఏన్యువల్ అవార్డు పంక్షన్ ని చెన్నై లోని నెహ్రూ ఇండోర్ స్టేడియమ్ లో జరిపారు. అభినయను స్టేజీపైకి పిలిచి సత్కరించారు. ఆమె ఓ రకమైన ఉద్వేగంతో స్టేజిపైకి వచ్చి నటుడు నంద, నటి కామ్నా చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా అభినయ తన తల్లి తండ్రులకు, దర్శకుడు సముద్రఖనికి, నిర్మాత శశికుమార్ కి ధాంక్స్ ని తన సైగలతో తెలియపరిచింది.

    సముద్ర ఖని కాళ్ళకు నమస్కరించి ఆ అవార్డుని మీకే వచ్చింది అన్నట్లుగా ఆయన చేతికి ఇచ్చింది. కళ్ళు చెమ్మగిల్లన సముద్రఖని మాట్లాడుతూ ..అభినయ నా కూతురు లాంటిది. ఆమెను హీరోకు చెల్లిగా నా చిత్రంలో తీసుకుంటానంటే నిర్మాత శశికుమార్...ఓ మూగమ్మాయి చేత నటింపచేయటం సాధ్యమేనా అన్నారు. నేను ఢెఫినిట్ గా ఆమె ఫిట్ అవుతుందని చెప్పాను. తెరపై ఎక్కడా ఆమె ఎక్సప్రెషన్స్ కానీ, లిప్ సింక్ చేసేటప్పుడుగానీ మూగ అమ్మాయన్న అనుమానం రాకుండా చేసింది. నా ఎక్సపెక్టేషన్స్ దాటి నటించింది అన్నారు. ఇక అభినయ తెలుగు చిత్రంలోనూ చేసి, అందరి మన్ననలు పొందింది. అలాంటి సమస్యతో ఉన్న ఎంతోమందికి ప్రేరణగా నిలిస్తుందనటంలో సందేహం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X