విక్రమ్ చిత్రాన్ని 17 సార్లు చూసిన స్టార్ హీరో
విక్రమ్ తమిళంలో నటించిన ధూల్ చిత్రాన్ని పదిహేడు సార్లు చూసానంటున్నాడు అభిషేక్ బచ్చన్. ఈ విషయాన్ని స్వయంగా అభిషేక్..విక్రమ్ కి తెలియచేసానన్నారు. తాను విక్రమ్ కి గ్రేట్ ఫాన్ ని అనీ, పితామగన్ (శివపుత్రుడు) చాలా షాక్ అయ్యానని, బోయ్స్ ఆడియో పంక్షన్ లో క్లోజ్ చూసిన విక్రమ్ తో ఓ చిత్రం చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యానని అభిషేక్ చెప్తున్నారు. ఆ కల రావణ్ తో తీరిందని మురిసిపోతున్నారు. అభిషేక్, విక్రమ్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో మణిరత్నం రూపొందించిన రావణ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు అభిషేక్. విక్రమ్..హిందీ రావణ్ కి విలన్ అయితే తెలుగు, తమిళ వర్షన్స్ కి హీరో కావటం ఈ చిత్రంలో విశేషం.
'రావణ్' చిత్రం జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొన్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యే ఈ చిత్రంలో విక్రమ్, అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల్ని ఆధారంగా చేసుకొని అల్లిన కథ ఇది అంటూ మణిరత్నం చేప్తున్నారు. అయితే కథ మొత్తం రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం చెన్నైలో తెలుగు వెర్షన్‌కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. విక్రమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. పల్లెటూరి యాసలో ఆయన సంభాషణలుంటాయి. ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలకమైన పాత్రను చేసింది.గురు తర్వాత మణిరత్నం చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











