మూడేళ్లు సంసారం చేశాం, డబ్బు కొట్టేసి పారిపోయింది.. నటిపై తీవ్ర ఆరోపణలు!

యువ నటుడు అభి శరవణన్, నటి అతిథి మీనన్ వివాదం రోజు రోజుకూ తీవ్రంగా మారుతోంది. అతిథి మీనన్ తన భార్యే అని శరవణన్ అంటుంటే.. అతడు అబద్దాలు చెబుతున్నాడని అతిథి మీనన్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో వీరిద్దరూ కోర్టుల చుట్టూ తిరిగుతో రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బుధవారం చెన్నైలో శరవణన్ మీడియాతో మాట్లాడుతూ అతిథి తన భార్యే అని, తామిద్దరికి వివాహం జరిగినట్లు ఉన్న రిజిస్టర్ మ్యారేజ్ ధ్రువ పత్రాన్ని మీడియా ముందు ఉంచాడు. అదే సమయంలో అతిథి మీనన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 వివాదం ఏంటంటే

వివాదం ఏంటంటే

తామిద్దరం 2016లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని శరవణన్ అంటున్నారు. మూడేళ్లపాటు కలసి కాపురం చేసిన తర్వాత ఇటీవల కొన్ని నెలల క్రితం విడిపోయారు. ప్రస్తుతం అతిథి మీనన్ ఓ వ్యాపారవేత్త కొడుకుతో సహజీవనం చేస్తున్నట్లు తేలింది. దీనితో భార్య భర్తలమైన తామిద్దరిని కలపాలంటూ శరవణన్ కోర్టుని ఆశ్రయించాడు. అతిథి కూడా శరవణన్ పై నమోదు చేసింది. తామిద్దరికి వివాహం కాకపోయినా, అయినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించాడని పోలికలు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

నన్ను అలా ప్రేమించింది

నన్ను అలా ప్రేమించింది

పట్టాదారి అనే చిత్రంలో నటిస్తున్న సమయంలో మాఇద్దరికి పరిచయం అయిందని శరవణన్ అంటున్నాడు. మరో చిత్రంలో నటిస్తున్న సమయంలో దర్శకుడితో అతిథి మీనన్ కు గొడవ జరిగింది. దీనితో దర్శకుడి నుంచి తనకు ముప్పు ఉందని భావించిన అతిథి నన్ను సాయం కోరింది. దీనితో తనని మధురై లోని తన నివాసానికి తీసుకెళ్లి కొంత కాలం ఆమెకు రక్షణ కల్పించా. దీనితో అతిథి తనని ప్రేమించడం మొదలుపెట్టిందని శరవణన్ అంటున్నాడు.

మూడేళ్లు సంసారం

మూడేళ్లు సంసారం

అతిథి తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారు. మా ప్రేమ విషయాన్ని వారికి తెలిపింది. పెళ్ళికి కూడా వారు అనుమతి ఇవ్వడంతో వివాహం చేసుకున్నాం. మూడేళ్లపాటు సంసారం చేశాం. కేరళలో ఉన్న అతిథి తల్లిదండ్రుల నివాసానికి అనేకసార్లు వెళ్ళాం అని శరవణన్ తెలిపాడు. గజ తుఫాన్ సందర్భంగా సేవాకార్యక్రమాలు నిర్వహించాహడానికి వెళ్ళా. ఆ సమయంలో అతిథి ఇంట్లోని డబ్బు, నగలతో పారిపోయిందని ఆరోపించాడు. ఇప్పుడు సుజిత్ అనే వ్యాపారవేత్త తనయుడితో సహజీవనం చేస్తోందని అన్నాడు.

కలవాలని ప్రయత్నించినా

కలవాలని ప్రయత్నించినా

అతిథి మీనన్ ని కలవడానికి అనేకసార్లు ప్రయత్నించా. కానీ సుజిత్ అనుచరులు నన్ను అడ్డుకుంటున్నారు అని ఆరోపించాడు. తాను సామజిక కార్యక్రమాల పేరుతో అక్రమంగా డబ్బు సంపాదించినట్లు ఆరోపిస్తోంది. నేను చేసిన ప్రతి సేవా కార్యక్రమానికి సంబందించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. అతిథి మీనన్ కేరళలో ఉండగానే ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. మరో వ్యక్తిని ప్రేమ పేరుతో మోసం చేసి వచ్చేసింది. ఇప్పటికి మించిపోయింది లేదు. అతిథి మంచి మారివస్తే ఆమెని భార్యగా ఏలుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని శరవణన్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X