కేరళకు అల్లు అర్జున్ ట్రిప్..షూటింగ్ కు కాదు
అల్లు అర్జున్ మార్చి 25న కేరళ వెళ్తున్నారు. అక్కడ గార్మెంట్ షో రూం ఓపినింగ్ ఫంక్షన్ కి వెళ్లుతున్నారు. కొట్టాయంలో ఉన్న ఇమ్మాన్యూయల్ సిల్క్ వారు అల్లు అర్జున్ ని పిలిచారు. గతంలో వారు షారూఖ్ ఖాన్ ని పిలిచి ఓపినింగ్ చేయించారు. అప్పుడు కొచ్చిలో ఈ షోరూం ఓపెన్ అయ్యింది. ఇక అదేరోజున కత్రినా కైఫ్ ని ర్యాంప్ వాక్ కి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇక నాన్ మళయాళి స్టార్ ని పిలిచి ఓపెన్ చేయించటమేంటని అక్కడ సినీ పరిశ్రమ విస్తుపోయి చూస్తోంది. వారు అల్లుఅర్జున్ వసూళ్లుని, ఆ క్రేజ్ ని చూసి గుర్రుమంటున్నారు. ఈ నేపధ్యంలో కింగ్ ఈవెంట్స్ మేనేజర్ శేఖర్ మాట్లాడుతూ...అల్లు అర్జున్ కి మళయాళంలో విపరీతమైన ప్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అందుకే అతన్ని పిలుస్తున్నాం అని చెప్పారు. ఇక అల్లు అర్జున్ చిత్రాలన్నీ అక్కడ డబ్ అయ్యి బాగా ఆడుతున్నాయి. అక్కడ టీవీ ఛానెల్స్ లో అల్లు అర్జున్ సినిమాలు కంటిన్యూగా వేస్తూంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. బ్యాంక్ దోపిడీ నేపధ్యంలో జరిగే కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఆ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











