twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్'పై హీరో సూర్య గేమ్

    By Srikanya
    |

    'బిజినెస్ మ్యాన్'చిత్రాన్ని మొదట సూర్య హీరోగా చేద్దామని వర్మ ప్లాన్ చేసారు. రక్త చరిత్ర ప్లాప్ కావటంతో సూర్య ప్రక్కకు తప్పుకున్నాడు. మహేష్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు దగ్గరైంది. ఈ సమయంలో ఈ కథపై నమ్మకంపోని తమిళ హీరో సూర్య గేమ్ ఆడటం ప్రారంభించాడని చెన్నై సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే.. మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ తమిళ వెర్షన్ పదిహేను రోజుల తర్వాత విడుదల చేస్తామని పూరి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలా పదిహేను రోజులు గ్యాప్ తర్వాత విడుదల చేయాలనే ఆలోచనకు కారణం ఉందంటున్నారు.

    వారు చెప్పేదాని ప్రకారం..ఈ వారంలో బిజినెస్ మ్యాన్ చిత్రం తెలుగులో రిలీజై పెద్ద హిట్టైతే దాన్ని తమిళంలో విడుదల చేస్తారు. అదే తేడా వస్తే..డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేస్తారు. అందుకుని డబ్బింగ్,రీమేక్ రైట్స్ తమిళ హీరో సూర్యకు చెందిన స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా తీసుకున్నారు. అయితే దాంట్లో రిస్క్ కూడా ఫిప్టీ పర్శంట్ ఛాన్సెస్ ఉంది. హిట్టైతే నో ప్లాబ్లం... అదే తేడా వస్తే.. తమిళంలో మార్కెట్..ఓపినింగ్స్ పడిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తమిళ రైట్స్ ని తీసుకుని ప్రక్కన పెట్టారంటున్నారు చెన్నై వర్గాలు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది.ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.

    English summary
    Businessman's Tamilnadu distribution and remake rights were bought by Gnanavel Raja of Studio Green.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X