రచ్చ రచ్చైన నయనతార బ్యాంకాక్ యవ్వారం
నయనతార రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్లి వచ్చింది. సినిమా తారలకు బ్యాంకాక్ వెళ్లటం కామన్ విషయమే అయినా నయనతార విషయంలో అది రివర్స్ అయ్యింది. ఆమె బ్యాంకాక్ వెళ్లిన విషయం పెద్ధ ఇష్యూగా మారి, మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె బ్యాంకాక్ వెళ్లింది కేవలం తన ఒంటి మీద ఉన్న పచ్చబొట్టుని చెరిపించుకోవటానికే అన్నది హైలెట్ అయ్యింది. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత ఆమె అతనికి చెందిన ఏ గుర్తునూ తన వద్ద ఉంచుకోవటానికి ఇష్టపడక ఇలా చేసిందనే వార్తలు షికారు చేసాయి.
ఈ నేపధ్యంలో నయనతార బ్యాంకాక్ టూర్ తెలిసిన కొందరు..ఆమె బ్యాకాంక్ లో అనుమతి ఉన్న ఓ చట్టవిరుద్దమైన కార్యక్రమానికి వెళ్లిందని,వచ్చేటప్పుడు భారీ సొమ్ముతో రానుందని చెన్నై కష్టమ్ అధికారలకు ఉప్పు అందించారు. దాంతో అలర్టన కష్టమ్స్ అధికారులు ఆమెను విమానాశ్రంయంలో ఆపేసారు. దాదాపు నలభై నిముషాలు పాటు ఆమెను రకరకాలుగా విచారించి వదిలిపెట్టారు. నయనతార ఇలా విమానాశ్రయంలో ఉంది అనే విషయం తెలిసిన మీడియా అక్కడకు చేరుకుంది. దాంతో వారంతా ఆమె పచ్చబొట్టు విషయం చెప్తుందని ఆశించిరాట.
అయితే ఆమె అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ తాను అజిత్ తో చేయబోయే చిత్రం లొకేషన్స్ చూడటానికి బ్యాంకాక్ వెళ్లానని సమాధానమిచ్చి సీరియస్ అయ్యింది. అంతేగాక ఆమె మేనేజర్ రాజాతో దానికి సంభందించిన వివరాలు చూపించి అందరి నోళ్లూ మూయించింది. ఏదో ఎక్సపెక్ట్ చేసినవారంతా ఏమీ చేయలేక అక్కడ నుంచి వైదొలిగారు. నయనతార మాత్రం తన ప్రేమ కథ విఫలమైనా ఇలా అడపా దడపా అది మీడియా సమక్షంలో మళ్లీ వినిపిస్తోండటంతో మనస్తాపం చెందిందని అక్కడి పత్రికలు రాసుకొచ్చాయి.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.


Click it and Unblock the Notifications











