ఎల్లుండే నయనతార సంచలన ప్రకటన

By Srikanya

నయనతార ఈ నెల 18న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజు ఆమె తన నటనకు స్వస్ధి చెప్పి, తన వివాహ తేదిని ప్రకటిస్తూ సంచలన ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తమిళ పత్రికలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఆమె రేపు విడుదల కాబోతున్న 'శ్రీరామ రాజ్యం'లో సీతగా నటించింది. ఆ రోజున నయనతార, ప్రభుదేవా కలిసి ఆ చిత్రాన్ని హైదరాబాద్‌లో చూస్తారు. 'శ్రీరామ రాజ్యం" నయనతార నటజీవితంలో ప్రత్యేకమైన చిత్రంగా నిలువనుంది. ఈ సినిమా తర్వాత ఆమె నటనకు గుడ్‌బై చెప్పనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆమె 'శ్రీరామ రాజ్యం" విడుదల అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. నవంబర్ 18 నయనతార పుట్టినరోజు. 'శ్రీరామ రాజ్యం" సాధించబోయే విజయం ప్రేక్షకులు తనకివ్వబోతున్న పుట్టినరోజు కానుక అని ఆమె అభివర్ణించారు.

అలాగే నటిగా ఎన్ని మంచి పాత్రలు చేసినా ఆత్మసంతృప్తిని ఇచ్చింది మాత్రం 'సీత" పాత్రేనని, ఈ పాత్ర తన నడవడికలో కూడా మార్పును తెచ్చిందని, తన మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర ఇదని నయన పేర్కొన్నారు. ఇంతటి గొప్ప పాత్రను ఇచ్చి తన గౌరవాన్ని పెంచిన బాపు, బాలకృష్ణ, యలమంచిలి సాయిబాబులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజున నయనతార కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో కలసి 'శ్రీరామ రాజ్యం" చిత్రాన్ని తిలకించనున్నారు. వచ్చే ఏడాది ప్రభుదేవాతో ఆమె పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X