సెంటిమెంట్ కోసమే పవన్ నెల రోజులు వెస్ట్ బెంగాళ్ క్యాంప్!?
త్వరలో పవన్ కళ్యాణ్ వెస్ట్ బెంగాళ్ కి ప్రయాణం కానున్నాడు.అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నాడు. ఆయన తనదుపరి చిత్రం షాడో కోసం అక్కడ షూటింగ్ లొకేషన్ ని ఎంచుకున్నారు. ఇంతకుముందు అక్కడ ఖుషీ చిత్రాన్ని షూట్ చేసారు.ఆ సెంటిమెంట్ తో అక్కడకి వెళ్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా సారా జేన్ ని ఎంపిక చేసారు.ఆమె క్రితం వారం విడుదలైన హిందీ చిత్రం గేమ్ లో నటించింది.ఇక ఈ చిత్రానికి నీలిమా తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఏప్రియల్ మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్ పై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అబ్బూరి రవి సంభాషణలన్నీ రాశాడు.ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరిని ఇప్పటికే ఎంపిక చేశారు. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక గతంలో విష్ణు వర్ధన్ అజిత్ తో చేసిన భిళ్ళా చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోకి సైతం ప్రభాస్ తో రీమేక్ అయింది. ఇప్పుడా చిత్రం ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే విష్ణు ఈ చిత్రం ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి ఫైట్స్: శ్యామ్ కౌశల్, రచన: రాహుల్ కోడా, కెమెరా: టి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీహరి ప్రసాద్, నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, యార్లగడ్డ శోభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.


Click it and Unblock the Notifications











