Vetrimaaran మూవీ షూటింగులో భారీ ప్రమాదం.. ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ అంటే.. అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన రూపొందించిన చిత్రాలు ప్రేక్షకుల గొప్ప అనుభూతిని పంచుతాయి. ప్రతీ సినిమాకు ప్రాణం పెట్టి తెరకెక్కిస్తారు. అందుకే ఆయన తీసిన ప్రతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరే కాకుండా.. ప్రేక్షకులు ఎప్పుడు గుర్తుంచుకొనేలా ఉంటాయి. అయితే వెట్రీమారన్ ప్రస్తుతం విదుథలై అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూరీ, విజయ్ సేతుపతి కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే శరవేగంగా జరుగుతున్న షూటింగులో అపశృతి చోటుచేసుకొన్నది. ఈ సినిమా షూటింగులో జరిగిన ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే..

విదుథలై సినిమాను గత రెండేళ్లుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్టులగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ చిత్రాలను షూట్ చేస్తున్నాు. అయితే ఈ షూటింగులో యాక్షన్ కోచ్ సురేష్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. తీవ్ర గాయాలపాలైన సురేష్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకొన్నది. దాంతో ఈ సినిమా యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. వెట్రిమారన్‌తోపాటు యూనిట్ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు.
తమిళంలో ప్రముఖ రచయిత జయమోహన్ రాసిన థునైవాన్ షార్ట్ స్టోరీ ఆధారంగా విదుథలై సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రం ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. భవానీ శ్రీ, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్నారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫి, ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











