రజనీకాంత్ అల్లుడి మూవీ షూటింగులో ఇద్దరు మృతి?
చెన్నై : రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ నటిస్తున్న సినిమా షూటింగులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు, ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఎంత వరకు నిజం అనేది నిర్ధారణ కాలేదు. ధనుష్ నటిస్తున్న 'నయ్యాండి' అనే తమిళ సినిమా షూటింగులో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని తిరువూరు వద్ద షూటింగు జరుగుతుండగా జలపాతంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ప్రమాద వశాత్తు పడి పోయారని అంటున్నారు. ఏది ఏమైనా నిజానిజాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ధనుష్ నటిస్తున్న మరియన్ షూటింగులో బోటు ప్రమాదం సంభవించినట్లు వార్తలు వినపించాయి. ఆ తర్వాత ధనుష్ ఆ వార్తలను ఖండించారు.


Click it and Unblock the Notifications











