దోపిడికి గురైన టాప్ యాంకర్.. హానిమూన్ ట్రిప్‌లో భంగపాటు.. పారిస్‌లో దిక్కు తోచని స్థితిలో
దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభతో రాణిస్తున్న యాంకర్, హోస్ట్, సింగర్ దివ్యకు చేదు అనుభవం ఎదురైంది. దేశం కానీ దేశంలో ఆమె దారుణంగా దోపిడికి గురికావడం, లక్షల విలువ చేసే వస్తువులు, కీలక పత్రాలు దోపిడికి గురికావడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితిలో చిక్కకున్నది. ప్రస్తుతం అధికారులకు ఫిర్యాదు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె వెలుగులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే..

తమిళంలో టాప్ యాంకర్‌గా
తమిళంలో స్టార్ విజయ్ ఛానెల్‌లో ప్రసారమయ్యే సూపర్ సింగర్ కార్యక్రమం ద్వారా దివ్య బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులు. పలు టెలివిజన్ షోలు, ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ టాప్ యాంకర్; హోస్ట్‌గా పేరు సంపాదించుకొన్నారు. టాప్ రేంజ్‌లో తన రంగంలో దూసుకెళ్తున్నారుు.

గాయనిగా రంగ ప్రవేశం
అంతేకాకుండా గాయనిగా ఇటీవల తమిళ సిని పరిశ్రమలో కాలుపెట్టారు. విల్లు అనే చిత్రంలో ధీం తనక థిల్లానా, తీర్థ విలైయట్టు పిళ్లై చిత్రంలో ఎన్ జానల్ వందా కాత్రే అంటూ ఆమె పాడిన పాటలు అత్యంత ప్రేక్షకదారణ పొందాయి. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.

ఇటీవలే ప్రియుడితో పెళ్లి
ఇలా గాయనిగా, హోస్ట్‌గా పలు శాఖల్లో రాణిస్తున్న దివ్య తాజాగా తన స్నేహితుడు శిభు థరకన్‌ను వివాహం చేసుకొన్నారు. దాంపత్య జీవితాన్ని ఆస్వాదించడానికి తన ఫ్రొఫెషన్‌కు కాస్త బ్రేకిచ్చి ఫ్రాన్స్ ట్రిప్‌కు వెళ్లారు. అలా వాళ్లు వైవాహిక జీవితంలో హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే వారు దోపిడి బారిన పడ్డారు. పారిస్‌లో దారుణంగా దోచుకోవడంతో దివ్య దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

హానిమూన్ ట్రిప్‌లో భంగపాటు
పారిస్ పట్టణంలో జరిగిన దోపిడి గురించి తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడిస్తూ.. ఓ పక్కన సూట్ కేసు, లాప్‌టాప్ బ్యాగ్ పెట్టి ఓ క్షణం గడవక ముందే వాటిని కొట్టేశారు. నాది, నా భర్త పాస్‌పోర్టు, 2 ల్యాప్‌టాప్‌లు, చార్జర్లు, ఐపాడ్స్, బోస్ హెడ్‌ఫోన్స్, ఎయిర్ ప్యాడ్, శింబు పెళ్లి దుస్తులు, విలువైన డ్రస్సులు, మేకప్ సామాగ్రి, కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ డాక్యుమెంట్లు అన్నీ పోయాయి అంటూ దివ్య తన ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపారు.
Recommended Video

లీగల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే
మా నుంచి దొంగలు కొట్టేసిన వస్తువల విలువ లక్షల్లోనే ఉంటుంది. మేము అక్కడి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంబసీ, లీగల్ అధికారుల దృష్టికి దోపిడి వ్యవహారాన్ని తీసుకెళ్లాం. అయితే వారి నుంచి పెద్దగా సానుకూల స్పందన కనిపించలేదు. అయినా శింబు తన పరిధిలో, తన శక్తి మేరకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు అని దివ్య తెలిపారు.


Click it and Unblock the Notifications











