మురగదాస్ షూటింగ్ లో యాసిడ్ దాడి
ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ లో ఓ చేదు సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే షూటింగ్ చెన్నైలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో ఈ దాడి జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతూండగా హాస్పటిల్ యాజమాన్యానికి, సినిమా వారికి మద్య రెంట్ విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదై షూటింగ్ లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టు లు అక్కడి స్టాఫ్ తో వివాదన్ని పెంచారు. దాంతో ఇరువైపులా వాదోపవాదాలు పెరిగి చివరకు హాస్పటిల్ స్టాఫ్ ఆవేశంగా తమకు అందుబాటులో ఉన్న యాసిడ్ తో దాడి చేసారు. దాంతో జూనియర్ ఆర్టిస్టులు కొందరుపై అది పడి పరిస్ధితి చేజారింది.దాంతో హాస్పటిల్ వారిపై పోలీస్ కంప్లైంట్ చేసి, వారిని వేరే హాస్పటిల్ లో చేర్చారు. ఇక ఈ చిత్రంలో అంజలి, జై నటిస్తున్నారు. దీనకి కేవలం మురుగుదాస్ నిర్మాతగానే వ్యవహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











