twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి ఆలయం.. ప్రారంభానికి యాక్షన్ కింగ్ అర్జున్ సిద్దం.. ఎప్పుడు? ఎక్కడంటే

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ సమాజ సేవలో భాగమవుతూ వస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సినీ రచయితగా, గాయకుడిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్న ఆయన శ్రీ ఆంజనేయస్వామికి పరమ భక్తుడనే విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంగా చెన్నై ఎయిర్‌పోర్టుకు సమీపంలో భారీ హనుమాన్ విగ్రహాన్ని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలయం పూర్తయిన నేపథ్యంలో ఆయన హనుమాన్ విగ్రహాన్ని భక్తులకు జూలై 1వ తేదీన అందుబాటులోకి తీసుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆ విషయం గురించి అర్జున్ వెల్లడిస్తూ..

    అర్జున్ వీడియో రిలీజ్ చేస్తూ.. అందరికీ హృదయపూర్వక నమస్కారం. 15 ఏళ్లుగా నిర్మిస్తున్న ఆంజనేయ ఆలయం పనులు పూర్తయ్యాయి. ఈ ఆలయానికి సంబంధించిన ప్రారంభ వేడుక, కుంభాభిషేకం కార్యక్రమం జూలై 1వ తేదీన చెన్నైలో జరుగుతున్నది. ఈ వేడుక కోసం చాలా మంది ప్రముఖులను, స్నేహితులు, సన్నిహితులు, భక్తులు, అభిమానులందర్నీ పెద్ద ఎత్తున ఆహ్వానించాలని అనుకొన్నాను. కానీ ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం, అలాగే కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. అయినా ఎవరూ కూడా ఈ సంరంభాన్ని మిస్ చేయకూడదు అనే ఉద్దేశంతో యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నాం. యాక్షన్ కింగ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా దానిని మీరు వీక్షించవచ్చు. అందరూ బాగుండాలని కోరుకొంటున్నాను అని అర్జున్ వెల్లడించారు.

    Action King Arjun Sarja to inaugurate Hanuman Temple in Chennai

    యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. 2021లో మలయాళంలో మరక్కార్: అరబికడలింతే సింహం, విరున్ను, ఫ్రెండ్‌షిప్, ఖిలాడి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. మేథవి అనే తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.

    English summary
    Action King Arjun Sarja to inaugurate Hanuman Temple in Chennai. This airport is built at Chennai Airport. This temple is going to inaugurate on July 1st. In corona Situation, This ceremony live streaming on Arjun Sarya's youtube Channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X