షూటింగులో గాయపడ్డ అజిత్.. హైదరాబాద్‌‌లో ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స

తమిళ సూపర్‌స్టార్ అజిత్ మరోసారి షూటింగ్‌లో గాయపడటంతో ఆయనను హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఆయన తన తదుపరి సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు సీహెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న వలిమై సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.

హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసి బైక్ రేసింగ్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బైక్ స్కిడ్ కావడంతో కిందపడగా.. చేతికి, కాలికి గాయాలు అయ్యాయి. దాంతో ఆయనను ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయాలు తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండటంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

 Actor Ajith injured in CH Vinods Valimai, Joined in hospital

గతంలో కూడా వలిమై షూటింగులో అజిత్ గాయపడ్డారు. ఫిబ్రవరిలో జరిగిన షూటింగులో బైక్ స్కిడ్ కావడంతో గాయపడ్డారు. అయితే 20 నిమిషాలు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగులో పాల్గొన్నాడు. అయితే ఈ సారి మాత్రం విశ్రాంతి తప్పనిసరి అని సూచించడంతో ఆయన షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. అజిత్‌కు గాయం కావడంతో వారం రోజులపాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X