ప్రముఖ నటుడి తమ్ముడు ఆత్మహత్య.. కేసులో కొత్త మలుపు! పోలీసుల చేతిలో..
ప్రముఖ దక్షిణాది నటుడు, విలన్ పాత్రలతో మెప్పించిన ఆనంద్ రాజ్ తమ్ముడు కనకసబై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆనంద్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈయన ఆత్మహత్య విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

యాక్టర్ ఆనంద్ రాజ్..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో యాక్టర్ ఆనంద్ రాజ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు సినిమాల్లో విలన్‌గా నటించి టాలెంటెడ్ యాక్టర్‌గా పేరుతుచ్చుకున్నాడు ఆనంద్ రాజ్. తెలుగులో పెదరాయుడు సినిమాలో ఆయన పోషించిన విలన్ రోల్ తెలుగు ప్రేక్షకులు ఏ నాటికీ మరచిపోలేరు. 100 సినిమాలకు పైగానే నటించిన ఆనంద్ రాజ్ తమిళనాట పాపులర్ విలన్.

ఆనంద్ రాజ్ సోదరుడి ఆత్మహత్య
ఇటీవల ఆనంద్ రాజ్ సోదరుడు కనకసబై సూసైడ్ చేసుకోవడం తమిళ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. 55 సంవత్సరాల వయసున్న కనకసబై పాండిచ్చేరిలో బలవన్మరణానికి పాలుపడ్డాడు. ఈయన హఠాన్మరణంతో ఆనంద్ రాజ్ తీవ్రంగా కుటుంబం కలత చెందింది.

తమిళనాడులో వ్యాపారం.. ఆ కారణంగానే!
మృతి చెందిన కనకసబై తమిళనాడులో చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాడు. ఈ చిట్ ఫండ్స్‌లో ఆయనకు ఈ మధ్య తీవ్ర నష్టాలు రావడం, అలాగే ఇటీవలే కొనుగోలు చేసిన ఓ ఇంటి విషయమై సమస్యలు తలెత్తడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావించారు. మరోవైపు ఆనంద్ రాజ్ తన తమ్ముడి మరణం వెనుక ఏదో కుట్ర దాగివుందని ఆరోపించాడు.
Recommended Video


పోలీసుల విచారణలో.. కేసు కొత్త మలుపు
ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో భాగంగా కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కనకసబై ఆత్మహత్య లేఖ పోలీసుల చేతికి చిక్కింది. దీని ఆధారంగా ఆనంద్ రాజ్ మరో సోదరుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మరణించడానికి మరో అన్నయ్య భాస్కర్, అతని కొడుడు శివచంద్రన్ కారణమని ఈ లేఖలో కనకసబై పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తదుపరి విచారణలో భాగంగా వారిద్దరినీ న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు పోలీసులు.


Click it and Unblock the Notifications











