twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌ను సూపర్‌స్టార్‌గా చేసిన దర్శకుడు ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినీ జన్మను ప్రసాదించిన వారిలో ఒకరైన ప్రఖ్యాత దర్శకుడు జే మహేంద్రన్ ఇకలేరు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. మహేంద్రన్ మృతివార్తతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార వర్గాలు ఆయనకు సంతాపం ప్రకటించాయి. వివరాల్లోకి వెళితే..

    మహేంద్రన్ మరణవార్తతో..

    మహేంద్రన్ మరణవార్తతో..

    దర్శకుడు మహేంద్రన్ మరణవార్తను ఆయన కుమారుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. జే మహేంద్రన్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తూ డైరెక్టర్ మహేంద్రన్ ఇకలేరు. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు అని తన పోస్టులో పేర్కొన్నారు. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించండి అంటూ ఆయన అభిమానులను వేడుకొన్నారు.

     మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు

    మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు

    దర్శకుడు మహేంద్రన్ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు, అభిమానులు, సినీ దర్శకుల సందర్శనార్థం పార్దీవదేహాన్ని ఉంచుతారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తాం అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

     రజనీకాంత్‌ను సూపర్ స్టార్‌గా

    రజనీకాంత్‌ను సూపర్ స్టార్‌గా

    రజనీకాంత్‌ను సూపర్‌స్టార్‌గా మలవడంతో దర్శకుడు జే మహేంద్రన్‌ది గొప్ప పాత్ర. రజనీ నటించిన ముల్లమ్ మలరమ్ చిత్రంతో దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 1980లో ఆయన రూపొందించిన నేంజథాయ్ కిలాథే చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఆడియోగ్రఫి అవార్డులు ఆ చిత్రం అందుకొన్నది.

    నటుడిగా, దర్శకుడిగా మహేంద్రన్

    నటుడిగా, దర్శకుడిగా మహేంద్రన్

    గత మూడు దశాబ్దాల సినీ జీవితంలో కాళీ, జానీ, పనక్కర పిళ్లై, తంగ పాతక్కమ్, ఉత్తిరిపూక్కల్ లాంటి అత్యంత ప్రజాదరణ చిత్రాలను రూపొందించారు. నటుడిగా కామరాజ్, తెరీ, కాటమరాయుడు, నిమిర్, మిస్టర్ చంద్రమౌథి, సీతాకత్తి, పేట్టా చిత్రంలో నటించారు. ఆయన చివరి చిత్రం బూమరాంగ్.

    మణిరత్నం,శంకర్ దర్శకులుగా మారేందుకు

    మణిరత్నం,శంకర్ దర్శకులుగా మారేందుకు

    1979లో మహేంద్రన్ రూపొందించిన ఉత్తిరి పూకల్ అనే చిత్రం ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తి నింపింది. మణిరత్నం, శంకర్ లాంటి దిగ్గజ దర్శకులను డైరెక్టర్లుగా మార్చేందుకు ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. దర్శకుడిగా ఆయన మొత్తం 12 చిత్రాలు రూపొందించారు. అరవింద్ స్వామి, గౌతమి జంటగా రూపొందించిన శాసనం మూవీ ఆయనకు చివరిది. ఆ తర్వాత పదేళ్ల అనంతరం ఆయన నటుడిగా మారారు.

    English summary
    Noted Tamil filmmaker J Mahendran passed away on Tuesday morning in Chennai. The veteran director was 79 and was hospitalised due to kidney-related ailments. He was known to be the one who made Rajinikanth the superstar he is of today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X